కిరణ్ ఖేర్.. నటిగా బాలీవుడ్ లో ఎన్నో గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఓ స్టేట్మెంట్ ఆమె ఇచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

బీజేపీ చండీఘడ్ ఎంపీ కిరణ్ ఖేర్ ఫోటోతో ఉన్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె 'అత్యాచారాలు మా సంస్కృతిలో భాగం.. వాటిని ఆపలేము' అని హిందీ టెక్స్ట్ లో ఉంది. ఫేస్ బుక్ యూజర్లు ఈ ఫోటోను పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

ఈ పోస్టు ప్రజలను తప్పు ద్రోవ పట్టించేలా ఉంది.

గతంలో ఈ వ్యాఖ్యలు కిరణ్ ఖేర్ ఏమైనా చేశారేమోనని సామాజిక మాధ్యమాల్లో సెర్చ్ చేయగా.. ఆమె ఈ వైరల్ పోస్టులో ఉన్న వ్యాఖ్యలు అయితే చేయలేదు. 2018లో అత్యాచారాలపై ఆమె మాట్లాడుతూ 'మనుషుల మైండ్ సెట్ మారితే అత్యాచార ఘటనలు చోటు చేసుకోవని.. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి' అని ఆమె అన్నారు. 'ANI' , ‘The Times of India’ లో జనవరి నెల 2018 కథనాలను ప్రచురించారు.

2018 లో హర్యానాలో చోటు చేసుకున్న అత్యాచారాలపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మనుషుల మైండ్ సెట్ లో మార్పులు తప్పకుండా రావాలని అన్నారు. మార్పు అన్నది కుటుంబంలో నుండే మొదలవ్వాలి.. అప్పుడే సమాజంలో కూడా మార్పులు వస్తుంది అని ఆమె అన్నారు.

ఆమె చెప్పుకున్నా ఇతర స్టేట్మెంట్ల పక్కన ఆమె ఫోటోను ఉంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు. BOOM LIVE కూడా 2019లో ఈ పోస్టుల్లో నిజం లేదని తేల్చింది. ప్రజలను తప్పు ద్రోవ పట్టించడానికి ఈ పోస్టులను పెడుతూ ఉన్నారు.

అత్యాచారాలు భారతదేశ సంస్కృతిలో ఒక భాగమేనని అంటూ బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Claim Review :   Fact Check : అత్యాచారాలు భారతదేశ సంస్కృతిలో ఒక భాగమేనని బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ అన్నారా..?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story