భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లోకి భారీగా నీరు వచ్చి చేరాయి. వర్షపు నీరు వీధుల్లో పొంగి పొర్లుతూ ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

జనావాసాల్లోకి ఓ మొసలి వచ్చిందంటూ కొందరు ఓ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. కొందరు ఆ మొసలిని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. మిగిలిన వారంతా చూస్తూ ఉండిపోయారు. వాట్సప్ లో కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో నిజంగా హైదరాబాద్ లో చోటు చేసుకుందో లేదో చెప్పాలని న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ వచ్చింది.

నిజ నిర్ధారణ:

హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటన అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.



వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. ఆగష్టు 2019న ఘటనకు సంబంధించిన రిజల్ట్స్ ఎన్నో లభించాయి.

మొసలిని పట్టుకుంది ఆగష్టు 2019న.. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2019 సంవత్సరం ఆగష్టు నెలలో వడోదర నగరంలో భారీ వర్షం పడింది. ఆ సమయంలో విశ్వామిత్రి నదిలోకి వరద పోటెత్తింది. ఈ నదిలో మొసళ్ళు పెద్ద ఎత్తున నివసిస్తూ ఉంటాయి. వరదల కారణంగా నీటితో పాటూ అవి కూడా జనావాసాల్లోకి కొట్టుకు వచ్చాయి.

https://www.independent.co.uk/news/world/asia/crocodile-streets-flood-swim-india-vadodara-gujarat-river-vishwamitri-a9038191.html

ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. 'వరద నీరు ఉధృతంగా ప్రవహించిన కారణంగా వడోదరలోని హోసింగ్ కాంప్లెక్స్ లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఆ నీటిలో ఓ మొసలి కూడా వచ్చేసింది. 10 అడుగుల పొడవు ఉన్న మొసలిని చూసి స్థానికులు భయపడి పోయారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆ మొసలిని పట్టుకోడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి వారు మొసలిని పట్టుకున్నారు. లాల్ బాగ్ లేక్ లో మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి. నీరు పొంగి వలన ఆ మొసలి కూడా జనావాసాల్లోకి వచ్చేసింది.

ఈ ఘటనకు సంబంధించి పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం వచ్చి ఆ మొసలిని పట్టుకుందని చెప్పుకొచ్చారు.



వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుందని చాలా ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా కన్ఫర్మ్ చేశాయి.

https://www.indiatoday.in/india/story/odisha-floods-giant-crocodile-strays-into-village-in-jajpur-district-1715890-2020-08-27

హైదరాబాద్ లో వరద నీటిలో మొసలి కొట్టుకుని వచ్చిందని వైరల్ అవుతున్న మెసేజీల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం లోని వడోదరలో 2019 ఆగష్టు నెలలో చోటు చేసుకుంది.

Claim Review :   Fact Check : హైదరాబాద్ లో జనావాసాల్లోకి మొసలి వచ్చిందంటూ వైరల్ అవుతున్న పోస్టులు..!
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story