రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ

By సుభాష్  Published on  16 Oct 2020 9:01 AM GMT
రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 నాణేన్ని విడుదల చేశారు ప్రధాని నరేంద్రమోదీ. దేశంలో పోషకాహార లోపం సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ పంటల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, సరైన సౌకర్యాలు లేనందున ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవడం సమస్యగా మారిందని అన్నారు. దీని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

కాగా, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు మరింత లబ్దిపొందుతారని ప్రధాని అన్నారు. ఈ ఏడాది నోబెల్‌ బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమానికి ప్రకటించడాన్ని మోదీ ఆహ్వానించారు.

అయితే మీరు ఈ కాయిన్స్‌ పొందాలని అనుకుంటే 'India Government Mint' వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా ఐజీ మింట్‌ వెబ్‌సైట్‌లో ఈ నాణేలు అందుబాటులో ఉన్నాయి. ఈ కాయిన్స్‌ను ఫ్రీ బుకింగ్‌ చేసుకోవాలి. ఒకేసారి 10 నాణేలకన్నా ఎక్కువ కావాలనుకుంటే పాన్‌ కార్డు ఖచ్చితంగా అవసరం ఉంటుంది.

Next Story
Share it