విష్ణు కోసం రంగంలోకి విక్ట‌రీ వెంక‌టేష్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2020 7:55 AM GMT
విష్ణు కోసం రంగంలోకి విక్ట‌రీ వెంక‌టేష్‌

టాలీవుడ్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్‌ మోహ‌న్‌బాబు త‌న‌యుడు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా 'మోసగాళ్లు' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ పెద్ద‌ ఐటీ స్కా్‌మ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తుంది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. అలాగే ఈ చిత్రంలో రుహీ సింగ్, నవదీప్, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. మోసగాళ్లు సినిమాకు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో హీరో వెంకటేష్ రిలీజ్ చేసిన టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంది.

ఇదివ‌ర‌కే ఈ చిత్ర టీజర్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశాడు. తాజాగా వెంకటేష్ వాయిస్ ఓవర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ బావిస్తోంది. ఇదిలావుంటే.. ఈ సినిమాలో విష్ణు, కాజల్ అగర్వాల్ అన్న చెల్లిలిగా నటిస్తున్నారనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌య‌మై స్ప‌స్ట‌త రావాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కూ వేచిచూడాల్సిందే.

Next Story