మీ ఊళ్లో ఉండకండి.. కడుపు నిండిన వాడి పక్కన అస్సలు కూర్చోవద్దు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2020 10:07 AM GMT
మీ ఊళ్లో ఉండకండి.. కడుపు నిండిన వాడి పక్కన అస్సలు కూర్చోవద్దు

దర్శకుడు పూరీ జగన్నాథ్.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేన్ని పేరు. బాచీతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తీసి అభిమానులంద‌రి హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు. తాజాగా ఆయ‌న‌ 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా 'వేట' గురించి మాట్లాడారు.

View this post on Instagram

‪👉 https://youtu.be/cjS3O2cxa64 @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

మంగళవారం మంచిది కాదు అని ఓ కుక్కని కన్విన్స్ చెయ్యలేం. శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేస్తే స్వర్గానికి వెళతావని ఓ కోతికి నచ్చచెప్పలేం. ప్రపంచంలో ఏ జంతువూ ఫిక్ష‌న్ క‌ల్పిత క‌థ‌ల‌ను నమ్మదు. జంతువులు వాస్తవాలనే నమ్ముతాయి. కానీ, బూదిద పూస్తే దెయ్యం రాదు అంటే మనం నమ్ముతాం. ఈ రాయిని లోపల పెట్టుకుంటే ప్రపంచాన్ని ఏలతావు అంటే నమ్ముతాం. మనిషి వేటగాడిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఏడు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం క‌నిపెట్టాడు. వేట మానేశాడు. ఇంటి చుట్టూ పంట. చేతిలో కంచం. పని తగ్గింది. కల్పిత కథలు మొదలయ్యాయి. వాటిని వినడమే కాదు నమ్మడం కూడా మొదలెట్టాడు. అక్క‌డి నుండే అన్ని దరిద్రాలూ చుట్టుకున్నాయి. తర్వాత దేవుడు పుట్టాడు. మతం పుట్టింది. నమ్మకాలు మొదలయ్యాయి. వాటి మధ్య పెరిగాం. ప్రశ్నించే ధైర్యం లేదు. నలుగురితో నారాయణ.. గుంపుతో గోవింద. ఇప్ప‌టికీ క‌ల్పితంలో ఉన్న జంతువుల‌న్ని నిజంలో బ‌తుకుతాయి. మ‌నం మాత్రం అబ‌ద్దంలో బ‌తుకుతున్నాం. కంచంలోకి ఉచితంగా భోజనం వచ్చినన్ని రోజులూ ఇలాగే ఉంటుంది. కానీ, వేటగాడెప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. మీరు వేట మానొద్దు. మీ ఊళ్లో ఉండొద్దు. కడుపు నిండిన వాడి పక్కన అస్సలు కూర్చోవద్దని చెప్తూ పూరీ ఈ సారీ టాఫిక్‌ను ముగించారు.

Next Story