'సోలో'గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్ చేయ్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2020 6:26 AM GMTరేయ్ మూవీతో ఆరంగ్రేటం చేసి టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాలోని 'అమృత' పాటను చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు చిరంజీవి.
హ్యాపీ బర్త్‌డే ప్రియమైన సాయి ధరమ్ తేజ్. 'సోలో'గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్ చేయ్. నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులేన'ని చిరంజీవి పేర్కొన్నారు.
గతేడాది 'ప్రతి రోజూ పండగే' సినిమాతో విజయం అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటరు' నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందించాడు. థియేటర్లు మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవనున్న నేఫథ్యంలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.