బిగ్‌బాస్‌ వాళ్లే నాగార్జునను 'బిట్టూ' అని పిలవమన్నారు: క్లారిటీ ఇచ్చిన సుజాత

By సుభాష్  Published on  15 Oct 2020 5:42 AM GMT
బిగ్‌బాస్‌ వాళ్లే నాగార్జునను బిట్టూ అని పిలవమన్నారు: క్లారిటీ ఇచ్చిన సుజాత

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. మొదటి మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగో సీజన్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆరో వారం కొనసాగుతోంది. ఇక ఐదో వారంలో జోర్దార్‌ సుజాత ఎలిమినేట్‌ అయింది. కాకపోతే హౌస్‌లో ఆమె నవ్వు చాలా మందికి చికాకు తెప్పించింది. అది ఫేక్‌ నవ్వు అని ప్రేక్షకులు బలంగా నమ్మారు.ఇక స్టార్ హీరో అయిన నాగార్జున హోస్టుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే నాగార్జునను గౌరవంగా పిలవకుండా బిట్టూ అని పివడం ఆయన అభిమానులకు నచ్చలేదు. అయితే బిట్టూ అని పిలవడం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. తాజగా జోర్దార్‌ సుజాత హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నాగార్జునను బిట్టూ అని పిలవడం వెనుక కారణమేంటో క్లారిటీ ఇచ్చింది. ఆమె మాటల్లో..

'నేను అక్కడ వెళ్లగానే బిగ్‌బాస్‌ టీమ్‌ నాగార్జున అంటే ఇష్టమా అని అడిగారు. ఇష్టం..అందులోనూ ఆయన చేసిన 'మనం' సినిమా, బిట్టు పాత్ర మరీమరీ ఇష్టమని చెప్పాను. దీంతో బిట్టూ అని పిలవడానికి నీకు ఇష్టమేనా అని అడిగారు. సరేనన్నాను. నేను అలా పిలిచినప్పుడు కూడా నాగార్జున సర్‌ చాలా సంతోషపడ్డారు. ఒక వేళ అలా పిలవడం నాగార్జునకు కానీ, బిగ్‌బాస్‌ టీమ్‌కు కానీ నచ్చకపోతే నన్ను కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచి అలా పిలవ వద్దని చెప్పేవాళ్లు. వాళ్లంతట వాళ్లే బిట్టూ అని పిలవమన్నారు. అయితే ఇలా పిలవడం నాగార్జున సర్‌ అభిమానులకు నచ్చలేదని నేను బయటకు వచ్చాక తెలిసింది. బిట్టూ అని పివడం వల్ల అభిమానులు బాధపడితే క్షమించండి.. నేను కావాలని పిలవలేదు. బిగ్‌బాస్‌ వాళ్లు చెబితేనే అలా పిలిచాను.. అని సుజాత క్లారిటీ ఇచ్చింది.

Next Story