హీరో సచిన్‌ జోషి అరెస్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2020 5:40 AM GMT
హీరో సచిన్‌ జోషి అరెస్ట్

గుట్కా అక్రమ రవాణా కేసులో హీరో, నిర్మాత సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సచిన్‌ జోషీ హైదరాబాద్‌కు భారీగా గుట్కా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌నిపై ఐపీసీ 273, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో పోలీసుల విచారణలో నిందితులు పలు సంచలన విషయాలు వెల్ల‌డించారు. ఈ విచారణలో సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో పోలీసులు అత‌న్ని అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం స‌చిన్ జోషి, టాలీవుడ్ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేష్ మ‌ధ్య కూడా లావాదేవీల‌కు సంబంధించి ఓ వివాదం జ‌రిగింది. తాజాగా ఈ వివాదంతో మ‌రోమారు వార్త‌ల్లో నిలిచాడు సచిన్‌.

మత్తు పదార్థాలు అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. బాలీవుడ్‌లో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్‌ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. ఆయన తండ్రిని గుట్కా కింగ్‌గా పిలుస్తుంటారు. సచిన్‌ జోషి తెలుగులో ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్‌ పండు, ఆజాన్‌, జాక్‌పాట్‌, వీరప్పన్‌, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్‌ చిత్రాల్లో నటించారు.

Next Story