విజ‌య‌వాడ‌ నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు నిర్మించిన‌ కనకదుర్గ ఫ్లైఓవర్ ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం వైఎస్‌ జగన్‌ లు శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం కొత్త‌గా రూ. 7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. అలాగే.. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం ఇచ్చారు.

ఇదిలావుంటే.. రూ.502 కోట్ల వ్య‌యంతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం పూర్తి కావడంతో త్వ‌ర‌లోనే అధికారికంగా వాహనాలకు అనుమతించ‌నున్నారు. ఒక‌ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ఘనతను దేశానికి చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వీడియోను రూపొందించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story