న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  29 July 2020 11:36 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

బ్రేకింగ్: భారత్‌ గడ్డపై అడుగు పెట్టిన రఫేల్‌ యుద్ధ విమానాలు

అత్యంత శక్తివంతమైన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌లో దిగాయి. ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ హర్యానాలోని అంబాలా ఎయిర్‌ బేస్‌లో సురక్షితంగా దిగినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఇండియా గడ్డపై రఫేల్‌ యుద్ధ విమానాలు దిగడంతో మిలటరీ చరిత్రలో నవశకం మొదలైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్‌ చేశారు..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు

మలేషియా మాజీ ప్రధాన మంత్రి నజీబ్‌ రజాక్‌కు ఆ దేశ కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉన్న సమయంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అవినీతి ఆరోపణలతో రెండేళ్ల కిందట అధికారం కోల్పోయిన ఆయన .. మాలే పార్టీ నుంచి రజాక్‌ను బహిష్కించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీయే మళ్లీ అధికారంలో వచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆర్జీవీకి షాక్.. ఆ సినిమా పోస్టర్లపై భారీ జరిమానా

హైద‌రాబాద్ : టాలీవుడ్‌ దర్శకుడు రాంగోపాల్ వర్మకి గ‌ట్టి షాక్ త‌గిలింది. అనుమతి లేకుండా పవర్ స్టార్ సినిమా పోస్టర్లు పెట్టడంపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ జరిమానా విధించింది. ఆర్జీవీ ప‌వ‌ర్ స్టార్ సినిమాకు సంబంధించి నగర వ్యాప్తంగా 30కి పైగా పోస్టర్లు ఏర్పాటు చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

క్రికెట్‌కు ఆ స్టార్ ఆల్‌రౌండ‌ర్ గుడ్‌బై

దేశ‌వాళీ క్రికెటర్, ఐపీఎల్ ఆట‌గాడు రజత్ భాటియా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేర‌కు ప్రొఫెషనల్ క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు రజత్ భాటియా బుధవారం రోజున ప్రకటించాడు. ఆల్‌రౌండర్ అయిన‌ రజత్.. త‌న‌ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌లో‌.. బౌలర్‌గా 137 వికెట్లు పడగొట్టడ‌మే కాకుండా.. బ్యాట్స్‌మెన్‌గా కూడా 6,482 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచ‌రీలు కూడా ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత్‌లో దిగిన రఫేల్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు ఇవే..

అత్యంత శక్తివంతమైన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌లో దిగాయి. ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ హర్యానాలోని అంబాలా ఎయిర్‌ బేస్‌లో సురక్షితంగా దిగాయి. ఇండియా గడ్డపై రఫేల్‌ యుద్ధ విమానాలు దిగడంతో మిలటరీ చరిత్రలో నవశకం మొదలైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్‌ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భార్యను చంపిన తొమ్మిదో భర్త..

భార్య ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని గమనించిన భర్త ప్రవర్తన మార్చుకోమని పలుమార్లు వారించాడు. అయినప్పటికి భార్య మాట వినకపోవడంతో ఆమెను హత్య చేశాడు. పోలీసుల విచారణంలో దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆ మహిళకు అతను తొమ్మిదో భర్త. అప్పటికే ఆ మహిళ 8 పెళ్లిళ్లు చేసుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అమ్మ మాట.. నాన్న బాట.!

సోనూసూద్‌.. గత నాలుగు నెలలుగా అందరి నోట్లో నానుతున్న పేరు. టాలీవుడ్, బాలీవుడ్‌ తెరపై ప్రతినాయకుడి పాత్రలో అత్యద్భుతంగా జీవించి.. ప్రేక్షకుల వళ్లు జలదçరింప చేసిన ఈ నటుడు.. నిజ జీవితంలో హీరోగా మారుతున్నాడు. మానవీయతకు, దానగుణానికి, మంచి మనసుకు మరోరూపంగా ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. తన చెవికి తాకిన, కంటికి ఆనిక ఏ బాధాతప్త సంఘటనైనా, అది ఎక్కడ జరిగినా వెంటనే నేనున్నానని స్పందిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కంటైనర్‌లో ఇరుకున్న కారు.. ఎస్‌బీఐ ఉద్యోగి సజీవ దహనం

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో జరిగింది. కారులో సజీవదహనమైన వ్యక్తిని నంద్యాల మండలం రైతునగరం చెందిన శిశకుమార్‌గా గుర్తించారు. ఇతను నంద్యాల ఎస్‌బీఐ బ్యాంకులో వ‌ర్క్ చేస్తున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అలిపిరి రోడ్ల మీద రష్యా అమ్మాయి.. అసలు విషయం తెలిస్తే..

కరోనా విసిరిన సవాళ్లతో ఊహించని పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల మానవత్వం పరిమళిస్తే.. మరికొన్నిచోట్ల దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పే అంశం మొదటి తరహాలోనిది. రష్యాకు చెందిన ఎస్తర్ కు అథ్యాత్మిక భావనలు ఎక్కువ. ఫిబ్రవరిలో భారత్ కు వచ్చారు. ఫిజియోథెరపిస్ట్ అయిన ఆమె తన తల్లి ఒలివియాతో కలిసి భారత్ కు వచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పులుల గ‌ణ‌న ఎలా చేప‌డ‌తారు.. నేడు అంత‌ర్జాతీయ పులుల దినోత్స‌వం

పులితో పోరాటం చేయాలంటే ప్రాణాలపై ఆశలను వదులుకోవడమే. అయితే ఇది గతం మాత్రమే. ప్రస్తుతానికి వస్తే పులులను చంపొద్దు… వాటికి కాపాడుకోవాలి చెబుతున్నారు అధికారులు. మనిషి దురాశకు పులులు బలైపోతున్నాయి. ఇందుకు వరల్డ్ లైఫ్ గణాంకాలే నిదర్శనం. అయితే జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా న్యూస్ మీటర్ ప్రత్యేక కథనం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story