మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు

By సుభాష్  Published on  29 July 2020 10:00 AM GMT
మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు

మలేషియా మాజీ ప్రధాన మంత్రి నజీబ్‌ రజాక్‌కు ఆ దేశ కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉన్న సమయంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అవినీతి ఆరోపణలతో రెండేళ్ల కిందట అధికారం కోల్పోయిన ఆయన .. మాలే పార్టీ నుంచి రజాక్‌ను బహిష్కించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీయే మళ్లీ అధికారంలో వచ్చింది.

రజాక్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెట్టుబడి సంస్థ నుంచి 49.4 మిలియన్‌ డాలర్లను దారి మళ్లించి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ కేసులో న్యాయమూర్తి మహమ్మద్‌ నజ్లాన్‌ ఘజాలి తీర్పు వెలువరించారు. అధికార దుర్వినియోగానికి 12 ఏళ్లు, మూడు నేరపూరిత కార్యకలాపాలకు 10 ఏళ్ల చొప్పున, మూడు మనీ లాండరింగ్‌ నేరాలకు 10 ఏళ్ల చొప్పున శిక్ష విధించారు. అయితే మొత్తం 12 ఏళ్ల శిక్ష అనుభవిస్తే సరిపోతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంకా నాలుగు కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.

కాగా, 2018లో జరిగిన 1ఎండీబీ ఇన్వెస్ట్ మెంట్‌ ఫండ్‌ కుంభకోణం ద్వారా అనేక బిలియన్‌ డాలర్లను నజీబ్‌ కొల్లగొట్టాడనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలతోనే నజీబ్‌ రజాక్‌ మలేషియా కోర్టులో దోషిగా తేలారు. మలేషియాలో నూతన ప్రభుత్వం కొలువుతీరిన కొన్ని నెలల్లోనే ఈ తీర్పు రావడం విశేషం. తన పార్టీ నేతృత్వంలో ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నజీబ్‌ కీలక పాత్ర పోషించాడు. కాగా, ప్రస్తుత తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానని నజీబ్‌ చెబుతున్నారు.

Next Story