అత్యంత శక్తివంతమైన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌లో దిగాయి. ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ హర్యానాలోని అంబాలా ఎయిర్‌ బేస్‌లో సురక్షితంగా దిగినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఇండియా గడ్డపై రఫేల్‌ యుద్ధ విమానాలు దిగడంతో మిలటరీ చరిత్రలో నవశకం మొదలైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్‌ చేశారు. ఎయిర్‌ఫోర్స్‌ శక్తి సామర్థ్యాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.

కాగా, రెండు రోజుల కిందట ఫ్రాన్స్‌ తొలి విడతగా ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు బయలుదేరాయి. వీటిలో మూడు శిక్షణ విమానాలు ఉన్నాయి. అనంతరం యూఏఈలో విశ్రాంతి తీసుకున్న అనంతరం బుధవారం అక్కడి నుంచి భారత్‌కు చేరుకున్నాయి. భారత గగనతలంలో రఫేల్‌ యుద్ధ విమానాలకు సుఖోయ్‌ ఫైటర్‌ జెట్స్‌ రక్షణగా ఉన్నాయి. ఐదు రఫేల్ జెట్స్ ముందు ప్రయాణిస్తుండగా.. వాటికి కాపలాగా రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు వెనుక అనుసరించాయి.

2016 సెప్టెంబర్‌లో భారత్‌ – ఫ్రాన్స్‌ మధ్య రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందం కుదిరింది. రక్షణ అవసరాల నిమిత్తం ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నారు. వీటి కోసం భారత్‌ ప్రభుత్వం రూ.58వేల కోట్లు ఖర్చు చేసింది. మొదటి దశగా ఐదు విమానాలు భారత్కు చేరుకున్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్‌ వినియోగిస్తున్న విమానాల కన్నా అత్యధునికమైనవి. భారత పరిస్థితులకు తగ్గట్లుగా మరింత ఖర్చుతో ఈ విమానాలలో అదనపు ఫీచర్లను జోడించారు. అయితే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్తే సత్తా ఈ రఫేల్‌ విమానాలకు ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort