భారత్ కు వచ్చే రఫెల్ రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఆయన సొంతం

By సుభాష్  Published on  29 July 2020 7:52 AM GMT
భారత్ కు వచ్చే రఫెల్ రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఆయన సొంతం

తనకు తానుగా ఫ్రాన్స్ తయారు చేసుకున్న ఆకాశ అద్భుతంగా రఫెల్ ను పలువురు అభివర్ణిస్తారు. యుద్ధ రంగంలో ఆకాశం నుంచి దాడి చేయటంలో చెలరేగిపోయే సత్తా ఉన్న రఫెల్ యుద్ధ విమానాలు ఐదు ఈ రోజున భారత్ కు చేరుకుంటున్నవిషయం తెలిసిందే. ఈ వార్త చదివే సమయానికి అవన్నీ భారత్ కు చేరనున్నాయి. దాదాపు ఏడువేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ కు చేరుకోవటానికి కొన్ని గంటల ముందు వీటిని యూఏఈలో ఉంచి.. అక్కడే రాత్రికి రెస్టు తీసుకొని.. వీటి పైలెట్లు తిరిగి బయలుదేరనున్న విషయం తెలిసిందే.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకోనున్నాయి. అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి అంబాలా ఎయిర్ బేస్ చాలా తక్కువ దూరంలోనే ఉందన్నది మర్చిపోకూడదు. వ్యూహాత్మకంగానే అంబాలా ఎయిర్ బేస్ లో ఈ యుద్ధ విమానాల్ని ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రఫెల్ యుద్ధ విమానాల్ని రిసీవ్ చేసుకోనున్నది ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్న.

ఆ అరుదైన అవకాశం వైమానిక దళం చీఫ్ ఆర్కెస్ భదౌరియా సొంతం కానుంది. ప్రస్తుతం ఆయన అంబాలాలో ఉన్నారు. అంబాలా ఎయిర్ బేస్ కు రఫెల్ వచ్చినంతనే వాటిని ఆయన రిసీవ్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అంబాలాలో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. భద్రతలో భాగంగా రఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ లను ఫోటోలు తీయకుండా నిషేధించారు. అంబాలా ఎయిర్ బేస్ పక్కనే ఉన్న దుల్కోట్.. బల్దేవ్ నగర్.. గార్నాలా.. పంజోఖర మొదలైన ప్రాంతాల నుంచి వీటి ఫోటోల్ని తీయకుండా ఆంక్షలు విధించారు.

Next Story
Share it