న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 6 July 2020 3:24 PM ISTలడఖ్ సరిహద్దుల్లో తొకముడిచిన చైనా సైన్యం
లడఖ్ సరిహద్దుల్లో చైనా సైన్యం తొకముడిచింది. భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ ప్రాంతం నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లింది. వివాదాస్పద ప్రాంతం నుంచి కిలోమీటర్ వరకు చైనా పీపుల్స్ ఆర్మీ వెనక్కివెళ్లింది. వివాదస్పద ప్రాంతంలో టెంట్‌లు, వాహనాలను ప్రభుత్వం తొలగించింది. నిజానికి చెప్పాలంటే భారత్‌ది పెద్ద విజయమేనని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలవడం కష్టమేనా..?
ఒకవైపు కరోనా.. మరో వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రత్యేక దృష్టి అమెరికా ఎన్నికలపై పడింది. విపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బిడెన్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కావడంతో ఎన్నికల ఘంటారావం ప్రారంభమైనట్లయింది. రిపబ్లికన్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు ఎప్పుడో ఖరారైపోయింది. ఇక ట్రంప్ ప్లోరిడా రాష్ట్రానికి చెందిన వారు .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆ రెండు కారణాల వలనే సచిన్ ఎప్పుడూ నన్నే మొదటి బంతిని ఆడమనేవాడు
సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ ఓపెనర్లంటే ఇలా ఉండాలి అనిపించేలా వారి బ్యాటింగ్ సాగింది. 176 వన్డేలలో ఇద్దరూ భారత్ కు ఓపెనర్లుగా ఆడారు. కానీ ఎప్పుడూ సౌరవ్ గంగూలీనే మొదటి బంతిని ఆడమనే వాడట సచిన్ టెండూల్కర్. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే.. కానీ సచిన్ ఎందుకు మొదటి బాల్ ను ఆడడానికి పెద్దగా ఇష్టపడడో సౌరవ్ గంగూలీ తాజాగా వెల్లడించాడు. అందుకు సచిన్ దగ్గర రెండు జవాబులు ఉండేవని గంగూలీ వెల్లడించాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్‌లో ఎటువంటి కబ్జాను చూసినా ఈ నెంబర్ కు ఫోన్ చేయండి..!
హైదరాబాద్ మహానగరం కబ్జా కోరల్లో ఎప్పటి నుండో చిక్కుకుంది. ఛోటా-బడా నాయకుల నుండి ఎంతో మంది కబ్జాలకు పాల్పడి భూమిని తమ సొంతం చేసుకున్నారు. ఒకరి ప్రాపర్టీ తమదని చెబుతూ కాగితాలను సృష్టించడం, ఆ ప్రాంతంలో బోర్డు పాతడం ఎప్పటి నుండో జరుగుతోంది. ప్రభుత్వ భూములను, చెరువులను కూడా సొంతం చేసేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఎన్నో చెరువులు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
డేంజర్ జోన్‌లో హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి రోజు కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇక తెలంగాణలోని ఇతర జిల్లాల కంటే ఒక్క హైదరాబాద్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టడంలో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. నెల రోజుల నుంచి జూన్ 5న తెలంగాణలో 3290 కేసులుండగా, మరణాలు 113 ఉండేవి. జూలై 6వ తేదీ నాటికి ఆ సంఖ్య 24వేలు దాటిపోయింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనా ఎఫెక్ట్: ఏపీలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడుతోంది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రభుత్వ పురస్కారాలను రద్ద చేస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2020-21 సంవత్సరానికి గానూ ఏపీ ప్రభుత్వం ... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనా కట్టడికి కేరళ సర్కార్ సంచలన నిర్ణయం
దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరం అవుతున్ననేపథ్యంలో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనాతో జీవితాంతం సహజీవనం చేయాల్సిందేనని, అందుకు జాగ్రత్తలు పాటిస్తూ, మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వెల్లుల్లి తింటే మతిమరుపు తగ్గుతుందా..!
వెల్లుల్లి ప్రతి ఇంట్లో వాడిదే. వెల్లుల్లి లేని ఇల్లంటూ ఉండదు. వెల్లుల్లితో చాలా రకాలుగా ఉపయోగాలున్నాయి. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఘాటైన వాసనతో ఉండే ఈ వెల్లుల్లి కొందరు తినేందుకు పెద్దగా ఇష్టపడరు. వైద్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఈ దర్శకుడి కెరీర్లో ఎన్ని మలుపులో..
‘క్షణం’ లాంటి క్లాసిక్, బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు రవికాంత్ పేరెపు. ఇంత మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వాడికి అవకాశాలు వెల్లువెత్తాలి. కానీ అలా జరగలేదు. బహుశా ‘క్షణం’ సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ అడివి శేష్‌కు వెళ్లిపోవడం ఇందుకో కారణం కావచ్చేమో. ‘సురేష్ ప్రొడక్షన్స్’లో రవికాంత్‌కు రానా దగ్గుబాటి హీరోగా ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ.. కథతో అందరినీ మెప్పించలేకపోయాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
టెన్షన్ పెడుతున్న కేసులు.. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్..!
గత 24 గంటల్లో భారత్ లో 27,094 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 676 మంది మరణించారు. కోవిద్-19 పాజిటివ్ కేసుల సంఖ్య భారత్ లో 6,97,358కి చేరుకుంది. 19,963 మరణాలు ఇప్పటివరకూ సంభవించాయి. మూడు రోజులు వరుసగా 20000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు దేశంలో మొత్తం 99,69,662 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి