కరోనా ఎఫెక్ట్‌: ఏపీలో జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

By సుభాష్  Published on  6 July 2020 4:46 AM GMT
కరోనా ఎఫెక్ట్‌: ఏపీలో జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడుతోంది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రభుత్వ పురస్కారాలను రద్ద చేస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2020-21 సంవత్సరానికి గానూ ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది. కోవిడ్‌-19 కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున అవార్డుల ప్రకటన చేయడం, వాటిని అందించడం సరైంది కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ ప్రకటన చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇక మరో వైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఆదివారం కొత్తగా 998 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో 961 రాష్ట్రానికి చెందినవి కాగా, 37 కేసులో ఇతర రాష్ట్రాల నుంచివచ్చిన కేసులు, ఇతర దేశాల నుంచిన ఒక కేసు నమోదైనట్లు వెల్లడించింది. ఇక ఒక్క రోజే 14 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు ఆ సంఖ్య 232కు చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18,697కేసులు నమోదయ్యాయి.

Next Story