వెల్లుల్లి ప్రతి ఇంట్లో వాడిదే. వెల్లుల్లి లేని ఇల్లంటూ ఉండదు. వెల్లుల్లితో చాలా రకాలుగా ఉపయోగాలున్నాయి. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఘాటైన వాసనతో ఉండే ఈ వెల్లుల్లి కొందరు తినేందుకు పెద్దగా ఇష్టపడరు. వైద్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం..

మధుమోహం ఉన్నవారికి..

ఇప్పుడున్న కాలంలో షుగర్‌ వ్యాధితో బాధపడేవారి సంఖ్య చాలానే ఉంది. ఒకప్పుడు వయసుమీద పడిన వారికి మాత్రమే మధుమోహం వచ్చేది. కాని ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వస్తోంది. నిత్యం ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంటాయట. వెల్లుల్లిలో మధుమోహాన్ని తగ్గించే గుణం ఉందంటున్నారు నిపుణులు.

పక్షవాతానికి ఎంతో ఉపయోగం

వెల్లుల్లి వల్ల యాంటీ ఆక్సిడెంట్స్‌, సూక్ష్మీక్రిములను చంపేసే యాంటి మైక్రోబయల్‌, విష పదార్ధాలను సైతం బయటకు పంపే యాంటీ సెప్టిక్‌ గుణాలు దాగివున్నాయి. వెల్లుల్లిని ప్రతి రోజు ఆహారంలో తినడం వల్ల హైపర్‌ టెన్షన్‌, ఇతర సమస్యలు దూరం అవుతాయి. తాజాగా దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడంతో ఎన్నో ఆశ్చర్యపోయే నిజాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా వెల్లుల్లిని తినేవారికి పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీనిని పచ్చిగా తినేవారికి అధికంగా లాభం ఉంటుందంటున్నారు.

వెల్లుల్లి వల్ల మతిమరుపు తగ్గుతుందా..?

వెల్లుల్లి తినడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఇది తినడం వల్ల మెదడుకు ఆక్సీజన్‌ సరఫరా అయి మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతేకాదు మతిమరుపుతో బాధపడేవారికి మంచి ఉపయోగం ఉందంటున్నారు. మతిమరుపునకు కారణమయ్యే అల్జీమర్స్‌ వ్యాధి రాకుండా ఉపయోగపడుతుంది.

గుండె సమస్యలకూ..

వెల్లుల్లి గుండె సమస్యలకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే శరీరంలో వ్యర్థపదార్థాలను పోగొట్టే గుణాలు చాలా ఉన్నాయి. దీని వల్ల శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ని పెంచడమే కాకుండా శరీరానికి హాని కలిగించే ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీని వల్ల రక్తనాళాలు కూడా మెరుగ్గా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వెల్లుల్లి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

కొవ్వును కరిగించే గుణం

మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించేందుకు వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. దీని వల్ల బరువు కూడా తగ్గిపోతారు. బరువు తగ్గాలనుకునే వారికి ఉదయం పూట పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet