న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 16 Aug 2020 12:53 PM GMTఒక్క రోజే 63,490 కొత్త కరోనా కేసులు.. మరణాలు 944
భారత్ లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మన్నెం మహిళలకు మరో ఉషస్సు.!
నలుగురు తనను చూసి నవ్వుకున్నారని.. తీసేసినట్టు మాటాడరని.. గడ్డిపోచకంటే హీనంగా చూశారని ఉషారాణి నాయక్ ఏనాడు కుంగిపోలేదు. కంటతడి కూడా పెట్టలేదు. తన మనసును రాయి చేసుకుంది. నోటి మాట ద్వారా కాదు చేతల ద్వారా తనేంటో చాటి చెప్పాలనుకుంది. గడ్డిపోచలతో కళాకృతుల తయారీకి శ్రీకారం చుట్టింది. క్రమంగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
విషాదం: 8 నెలలుగా కనిపించకుండా పోయిన జవాన్.. మంచులో మృతదేహం లభ్యం
ఎనిమిది నెలలుగా కనిపించకుండాపోయిన ఓ జవాను మృతదేహం ఎట్టకేలకు మంచులో లభ్యమైంది. భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ మంచుకింద శనివారం ఆర్మీ అధికారులు గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చమోలి గ్రామానికి చెందిన రాజేంద్రసింగ్ (36) 2001లో ఆర్మీలో చేరాడు. జమ్మూలోని గర్హ్వాల్ రైఫిల్స్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
యాంకర్ ప్రదీప్ మరో రికార్డు
బుల్లితెర యాంకర్ తెలుగు టీవీ తెరపై యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు వెండితెరపై కనిపించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇప్పటి వరకు ప్రదీప్ చేసిన షోలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పొలం బాట పట్టిన ఐఐటియన్.!
చదువు జ్ఞానాభివృద్ధికే కానీ ఉద్యోగం కోసమే కాదు. చాలా మంది కొలువులు తెచ్చుకోడానికే చదువులని భావిస్తారు. ఆ లక్ష్యంతోనే చదువుకుంటారు. అయితే కొందరు మాత్రం నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారులు వెతుక్కొంటారు. వారే చరిత్ర సృష్టిస్తారు. సాయిగోలె ఈ తరహా యువతి. మద్రాసులో ఐఐటీ చదివిన.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కోటి లంచం కథ : అసలేందీ రాంపల్లి భూవివాదం?
ఒక భూమికి సంబంధించిన వివాదాన్ని లెక్క తేల్చేందుకు కీసర ఎమ్మార్వో రూ.1.10కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకుంటున్న వేళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం తెలిసిందే. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి పట్టుకోవటం ఇదే తొలిసారిగా ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
విషాదంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషాదంలో మునిగిపోయారు. ట్రంప్ తమ్ముడు న్యూయార్క్‌లో మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ (71) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కేటీఆర్ కు ఎమ్మెల్యే గండ్ర ఫోన్.. స్పందించిన కేసీఆర్
ప్రముఖుల్ని రక్షించేందుకు యుద్ధ విమానాల్ని.. ఆర్మీ వాహనాల్ని రంగంలోకి దించటం చాలాసార్లు చూసే ఉంటాం. సామాన్యుల్ని రక్షించేందుకు హెలికాఫ్టర్లను రంగంలోకి దించే సీన్లు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా మాత్రం రియల్ గా తెలంగాణ రాష్ట్ర ము.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రైల్వే శాఖ కీలక నిర్ణయం..ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దు..?
దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఎక్స్ ప్రెస్, ఏసీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లు మాత్రం పట్టాలెక్కలేదు. అయితే రైల్వే శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ధోనీ రిటైర్మెంట్ పై సచిన్, సెహ్వాగ్, పీటర్సన్, వసీం అక్రమ్ ఏమన్నారంటే..!
మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం అతడి అభిమానులకు ఓ రకంగా షాకింగ్ విషయమే..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి