విషాదంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

By సుభాష్  Published on  16 Aug 2020 8:15 AM GMT
విషాదంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విషాదంలో మునిగిపోయారు. ట్రంప్‌ తమ్ముడు న్యూయార్క్‌లో మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌ వెల్లడించారు. ట్రంప్‌ తమ్ముడు రాబర్ట్‌ ట్రంప్‌ (71) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన ట్రంప్‌ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 2016లో రాబర్ట్‌ తన సోదరుడితో పాటు రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా మిల్‌బ్రూక్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించి నిధులు సైతం సేకరించారు.

శుక్రవారం రాత్రి న్యూజెర్సీకి వెళ్లిన డొనాల్డ్‌ ట్రంప్‌.. తన సోదరుడిని పరామర్శించేందుకు న్యూయార్క్‌ వెళ్లాలని నిర్ణయం తీసుకున్న ట్రంప్‌.. ఈలోగా తమ్ముడు ఆకస్మికంగా మృతి చెందడం ట్రంప్‌ను తీవ్రంగా కలచివేసింది. 1948లో జన్మించిన రాబర్ట్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడి నలుగురు సోదరులలో ఒకరు. రాబర్ట్‌ మృతిపై ట్రంప్‌ సంతాపం తెలిపారు.

'నా అద్భుత సోదరుడు రాబర్ట్‌ శాంతియుతంగా ఈ రాత్రి కన్నుమూశాడు. అతను నా సోదరుడు మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు. అతని జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి. ఐ లవ్‌ యూ రాబర్ట్‌. ఇక విశ్రాంతి తీసుకో.. అంటూ ట్రంప్‌ బరువెక్కిన హృదయంతో ప్రకటించారు.

Next Story