న్యూస్‌మీటర్.. టాప్ 10 న్యూస్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2019 8:20 PM IST1. ఖేల్ ఖతమ్.. దుకాణం బంద్..!
మహారాష్ట్ర: సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామ చేసిన కొన్ని గంటల్లోనే ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి నా రాజీనామా సమర్పిస్తానని ఫడ్నవీస్ తెలిపారు. సీఎంగా ప్రమాణం చేసి మూడ రోజుల తర్వాత ఫడ్నవీస్ పదవికి రాజీనామా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
2. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కీలక వ్యాఖ్యలు చేసిన ‘హైకోర్టు’
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కార్మికులు ఆత్మహల్యు చేసుకోవడానికి ప్రభుత్వమే కారణమని చెప్పడానికి ఆధారాలు ఏంటని ప్రశ్నించింది. కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వమే కారణమని ఆర్టీసీ జేఏసీ చెప్పడానికి ఆధారాలు చూపించండని పేర్కొంది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని, దానిని అదనుగా చేసుకొని ఆ నిందను సర్కార్‌పై నెట్టడం సరైంది కాదని హితవు పలికింది. కాగా, ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
3. అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య.. అత్యాచారం చేసి ఆపై..!
న్యూయార్క్: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆ యువతిపై కొందరు దుండగులు అత్యాచారం చేసి.. హత్యకు పాల్పడ్డారు. 19 ఏళ్ల రూత్ జార్జ్ చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలియనాస్‌లో చదువుకుంటోంది. శుక్రవారం నుంచి రూత్ జార్జ్ తల్లిదండ్రులకు అందుబాటులోకి రాలేదు. దీంతో వెంటనే తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ సిబ్బంది, పోలీసులు రూత్ జార్జ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో యూనివర్సిటీ గ్యారేజీలో సిబ్బందికి రూత్ జార్జ్ మృతదేహం లభ్యమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
4. ఆర్టీసీ బస్సు బీభత్సం… డ్రైవర్ నిర్లక్ష్యంతో యువతి మృతి
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలిగొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లు బస్సులను నడుపుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ 12లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ పై వెళుతున్న యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సోహిణీ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రోడ్ నెంబర్ 12 లో తీవ్ర ట్రాఫిక్ జాం అయింది. మసబ్ టాంక్ నుంచి బంజారా హిల్స్ వేపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
5. అజిత్ పవార్ రాజీనామా
మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. అనుహ్యరీతిలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా రేపు శాసనసభ బలపరీక్ష నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అజిత్ పవార్‌పై కుటుంబ సభ్యులు, ఎన్సీపీ నేతలు తీవ్ర ఒత్తిడికి తీసుకువచ్చారని సమాచారం. బలనిరూపణకు ముందే ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
6. 14400 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసిన వర్ల.. సీఎం జగన్‌పై ఫిర్యాదు
అమరావతి: అవినీతిపై ఫిర్యాదులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 14400 టోల్‌ఫ్రీ నెంబర్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కాల్ చేశారు. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని టోల్‌ఫ్రీ నెంబర్‌కు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ హయాంలో తండ్రి అధికారం అడ్డంపెట్టుకొని సీఎం జగన్ వేల కోట్లు సంపాదించారని వర్ల ఆరోపించారు. జగన్ రాజకీయ అవినీతిపైనా ఐఐఎం అధ్యయనం చేయాలన్నారు. కాగా ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
7. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ హీరో ‘ప్రిన్స్’
నగరంలో ట్రాఫిక్ పోలీసులు తాగుబోతులకు చెక్ పెట్టేందుకు ఎన్ని డ్రంకెన్ డ్రైవ్‌లు చేపట్టినా.. ఇంకా చాలా మంది పట్టుబడుతూనే ఉన్నారు. డ్రంకెన్‌డ్రైవ్ లోమామూలు జనాలే కాకుండా ప్రముఖులు పట్టుబడుతుండటంతో జనాలు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇన్ని చర్యలు చేపట్టినా తీరు ఎందుకు మారడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ సినీ హీరో డ్రైంకెన్ డ్రైవ్‌లో పట్టుబడటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. కాగా, నవంబర్ 24న ప్రముఖ సినీ ప్రిన్స్ సుశాంత్ డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
8. ఆ మారణహోమం జరిగి నేటికి 11 ఏళ్లు..!
ఈ రోజు నవంబరు 26. మాములు రోజులలా మర్చిపోయే రోజు కాదు ఇది. అఖండ భారతావనిని అలర్ట్ చేసిన రోజు. సరిగ్గా పదేళ్ల క్రితం (2008) ఇదే రోజున దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన రోజు ఇది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
9. అసాంజే ఆరోగ్యంపై ఆందోళన.. అతడు జైలులోనే చనిపోవచ్చట.!
వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే కు చికిత్స అవసరమని వైద్య బృందం చెబుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అసాంజే అనారోగ్యంతో జైలులోనే చనిపోవచ్చని సుమారు 60 మంది వైద్యులు బ్రిటన్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. 48 ఏళ్ల అసాంజే గూడాచర్యం చర్య కింద ప్రస్తుతం బ్రిటన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
10. టాస్ వేశాడా..? బౌలింగ్ చేశాడా..? నవ్వులు పూయిస్తున్న ఖవాజా..!
క్రికెట్‌లో అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆస్ట్రేలియా దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ మార్ష్ కప్ లో కూడా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా-క్వీన్స్‌లాండ్ జట్ల మధ్య పైనల్ పోరు జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ కు ఇరు జట్ల కెప్టెన్లు అయిన ఉస్మాన్ ఖవాజా-టర్నర్‌లు మైదానంలోకి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..