ఈ రోజు న‌వంబ‌రు 26. మాములు రోజుల‌లా మ‌ర్చిపోయే రోజు కాదు ఇది. అఖండ భార‌తావ‌నిని అల‌ర్ట్ చేసిన రోజు. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం (2008) ఇదే రోజున దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్ర‌మూక‌లు మారణహోమం సృష్టించిన రోజు ఇది.

ప‌దేళ్ల క్రితం స‌రిగ్గా.. నవంబర్ 26, 2008న‌ లష్కరే తోయిబాకి చెందిన 10మంది తీవ్రవాదులు ముంబై నగరంలో మారణహోమం సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌పై దాడులతో విరుచుకుపడ్డారు.

ఈ దాడిలో 166మంది చ‌నిపోగా.. 300మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఆనాటి మారణకాండను ఏ ఒక్కరూ మరిచిపోలేరు.

దాదాపు నాలుగు రోజుల పాటు దారుణ మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. పాక్ లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి ప్రవేశించారు. దాడికి పాల్ప‌డ్డ‌ ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ పట్టుబడగా.. అత‌డిని భార‌త్ 2012 నవంబర్ 21న ఉరితీసింది.

అలాగే.. ఉగ్రమూక‌ల‌ను ఎదుర్కోవ‌డానికి భద్రతా బలగాలు మూడురోజుల పాటు తీవ్రంగా శ్రమించాయి. ఈ ఆప‌రేష‌న్ లో మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కారే ఉగ్ర‌మూక‌ల‌తో పోరాడి అసువులుబాసాడు. ప్ర‌పంచాన్ని షాక్ గురిచేసిన ఈ ఘ‌ట‌న జ‌రిగి నేటికి 11 ఏండ్లు. ఇప్ప‌టికి ఈదాడిలో ప్రాణాలు కోల్పోయిన‌ భార‌తావని ముద్దుబిడ్డ‌లను మ‌నం స్మ‌రించుకుంటున్నామంటే.. ఈ దాడి చేసిన గాయం తీవ్ర‌త ఎంత‌గా ప్ర‌భావం చూపించిందో ఊహించ‌వ‌చ్చు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.