14400 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసిన వర్ల.. సీఎం జగన్‌పై ఫిర్యాదు
By అంజి Published on 26 Nov 2019 6:31 PM ISTఅమరావతి: అవినీతిపై ఫిర్యాదులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 14400 టోల్‌ఫ్రీ నెంబర్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కాల్ చేశారు. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని టోల్‌ఫ్రీ నెంబర్‌కు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ హయాంలో తండ్రి అధికారం అడ్డంపెట్టుకొని సీఎం జగన్ వేల కోట్లు సంపాదించారని వర్ల ఆరోపించారు. జగన్ రాజకీయ అవినీతిపైనా ఐఐఎం అధ్యయనం చేయాలన్నారు. కాగా ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది సూచించారు. సీఎం ప్రకటించినట్లుగా ఫిర్యాదుపై 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తనపై 43వేల కోట్ల రూపాయల అభియోగాలు పెట్టుకొని అవినీతిని అంతమొందిస్తా అని జగన్ ఎలా చెప్తున్నారన్నారు. తనపై తానే అధ్యయనం చేయించుకుంటానని సీఎం వైఎస్ జగన్ స్వచ్ఛందంగా ముందుకు రావాలని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.