డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ హీరో ‘ప్రిన్స్‌’

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు తాగుబోతులకు చెక్‌ పెట్టేందుకు ఎన్ని డ్రంకెన్‌ డ్రైవ్‌లు చేపట్టినా.. ఇంకా చాలా మంది పట్టుబడుతూనే ఉన్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌ లోమామూలు జనాలే కాకుండా ప్రముఖులు పట్టుబడుతుండటంతో జనాలు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఇన్ని చర్యలు చేపట్టినా తీరు ఎందుకు మారడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ సినీ హీరో డ్రైంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. కాగా, నవంబర్‌ 24న ప్రముఖ సినీ ప్రిన్స్ సుశాంత్ డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లిని కోర్టుకు హాజరయ్యారు ప్రిన్స్‌. బాచుపల్లిలోని వీఎన్ఆర్ కళాశాల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మంగళవారం కూకట్‌ పల్లి కోర్టుకు హాజరైన ప్రిన్స్ సుశాంత్ కి కోర్టు జడ్జీ రూ. 5వేల జరిమానా విధించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన సమయంలో పరీక్షలో 48 పాయింట్లు వచ్చాయి. ‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రం తో వెండి తెరకు పరిచయమైన ప్రిన్స్ సుశాంత్…మొదటి సినిమా తేజ దర్శకత్వంలో ప్లాప్ అయినప్పటికీ, బస్ స్టాప్ వంటి యూత్ ఫుల్ మూవీలో నటించారు. ఆ తరువాత రొమాన్స్ చిత్రంలో కూడా నటించారు. ప్రస్తుతం అదే తరహాలో చిన్న సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. అలాగే సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుడానికి ప్రయత్నాలు చేస్తూనే నేను శైలజ లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్‌ మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ -1 రియాలిటీ షో కూడా పాల్గొన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.