ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలిగొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లు బస్సులను నడుపుతున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ 12లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ పై వెళుతున్న యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సోహిణీ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రోడ్ నెంబర్ 12 లో తీవ్ర ట్రాఫిక్ జాం అయింది. మసబ్ టాంక్ నుంచి బంజారా హిల్స్ వేపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటన స్థలానికి వచ్చి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లను నియమించడంతో చాలా చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో తెలంగాణ ఆర్టీసీ పై జనాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story