న్యూస్‌ మీటర్‌ .. టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  17 Dec 2019 9:56 PM IST
న్యూస్‌ మీటర్‌ .. టాప్‌ 10 న్యూస్‌

1.సెగలు పుట్టిస్తోన్న ‘పౌరసత్వ సవరణ చట్టం’

కేంద్ర సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల రాజకీయ వేడి రాజుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళన ఉధృతమవుతున్నాయి. విద్యార్థులు ఆందోళనను ఉద్రిక్తం చేస్తున్నారు. ముందుగా ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన హింసాత్మక సంఘటనలు క్రమ క్రమంగా విస్తరిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

2. ఏపీలో మూడు రాజధానులు..చంద్రబాబు మండిపాటు

వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మూడు రాజధానులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశంలో రాజధానిపై జరిగిన చర్చలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

3. కోహ్లీ, రోహిత్‌ల రికార్డులు బ్రేక్ చేస్తా.. అంతేకాదు..

విండీస్ జ‌ట్టులో చాలా మంది క్రికెట‌ర్ల‌కు ఐపీఎల్‌ వేలానికి సంబంధించిన టెన్షన్‌ ఉంటుంది.. కానీ నాకైతే దానికి సంబందించి ఎటువంటి టెన్ష‌న్ లేద‌ని విండీస్ స్టార్ క్రికెట‌ర్ షాయ్ హోప్ అన్నాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా దేశం కోసం ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తాన‌ని హోప్‌ పేర్కొన్నాడు. అంతేకాకుండా.. ప్ర‌స్తుతం భారత్‌తో సిరీసే నాకు ముఖ్యమైంద‌ని.. పరుగులు చేయడమే నా ముందున్న టార్గెట్ అని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

4. ట్రంప్ పై ‘అభిశంసన’లో తర్వాతి మలుపేంటి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై సెనేట్ లో ప్రవేశపెట్టబోతున్న అభిశంసన తీర్మానానికి సంబంధించిన చర్చ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ అభిశంసన తీర్మానంలో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా రుజువైతే వెంటనే ఆయన పదవినుంచి వైదొలగాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

5. ఏపీలో మూడు రాజధానులు..చంద్రబాబు మండిపాటు

వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మూడు రాజధానులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశంలో రాజధానిపై జరిగిన చర్చలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ లెజిస్లేటివ్(చట్ట సభలు) క్యాపిటల్ గా అమరావతి, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూల్ లో జ్యుడిషియల్ (హైకోర్టు) క్యాపిటల్ ను ఏర్పాటు చేయచ్చన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

6. రేపు ఏం జరగనుంది.. భూమిపైకి దూసుకువస్తోన్న భారీ ‘గ్రహశకలం’

ఒక పెద్ద పిర‌మిడ్ ప‌రిమాణం క‌లిగిన గ్రహశకలం రేపు ఉద‌యం భూమి వైపు రానున్న‌ది. క‌న్ను మూసి తెరిచేలోపు భూమి ద‌గ్గ‌ర‌గా ఇలా వ‌చ్చి.. అలా వెళ్ల‌నున్న‌ది. గ్రహశకలం భూమి మీద ప‌డుతుందేమోన‌ని మ‌నంద‌రం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ గ్రహశకలం వ‌ల్ల మ‌న భూమికి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌ద‌ని నాసా పేర్కొంది. గ్ర‌హ‌శ‌క‌లానికి 2019 ఎక్స్ ఎఫ్ గా నామక‌ర‌ణం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

7. ‘రంగ‌మార్తాండ’లో రంగ‌మ్మ‌త్త‌.. ‘స్పైసీ రోల్’ అంట మ‌రి..!

జ‌బ‌ర్ద‌స్త్ షో యాంక‌ర్‌గా అన‌సూయ భ‌ర‌ద్వాజ్ తెలుగు వారికి సుప‌రిచితురాలే. అప్పుడ‌ప్పుడు ఐటం సాంగ్స్‌లో న‌ర్తించి.. హాట్ గ‌ర్ల్ ఇమేజ్‌ను తెచ్చుకున్న అన‌సూయ.. క్రియేటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్ రూపొందించిన రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందిన విష‌యం తెలిసిందే. రంగ‌మ్మ‌త్త‌తో అన‌సూయ‌కు మాంచి ఇమేజ్ వ‌చ్చినా త‌ను మాత్రం పాత్ర‌ల ఎంపిక‌లో అచితూచి అడుగులు వేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

8. ఆ ‘S’ ఆకారం మలుపులే కారణం.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌.. !

హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ను సరిపడా భూసేకరణ జరపకుండానే నిర్మించారని నిపుణుల కమిటీ సోమవారం నివేదిక జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌కు సమర్పించింది. సేకరించిన స్థలంలోనే నిర్మించడం వల్ల ఫ్లైఓవర్‌ వంపులు తిరిగిందని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

9. బ‌రిలోకి దిగిన బుమ్రా.. ఎంట్రీ ఎప్పుడంటే..!

వెన్ను గాయం కారణంగా ఆట‌కు దూరమైన టీమిండియా పేస్ బౌల‌ర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కోలుకుంటున్నాడు. జ‌న‌వ‌రిలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడ‌ట‌. ఈ మేర‌కు బుమ్రా గ్రౌండ్‌లోకి దిగాడు. అయితే.. గాయం నుంచి బుమ్రా కోలుకున్నా.. నేరుగా బౌలింగ్ చేస్తూ మైదానంలోకి దిగితేగాని మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో బుమ్రా సిద్ద‌మ‌య్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

10. 9 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సభలో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రతి రోజు సభ మొదలైనప్పటి నుంచి గందరగోళంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలపై చర్చించడం కంటే వారివారి తిట్ల పురాణాలే అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నుంచి తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి...

Next Story