విండీస్ జ‌ట్టులో చాలా మంది క్రికెట‌ర్ల‌కు ఐపీఎల్‌ వేలానికి సంబంధించిన టెన్షన్‌ ఉంటుంది.. కానీ నాకైతే దానికి సంబందించి ఎటువంటి టెన్ష‌న్ లేద‌ని విండీస్ స్టార్ క్రికెట‌ర్ షాయ్ హోప్ అన్నాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా దేశం కోసం ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తాన‌ని హోప్‌ పేర్కొన్నాడు. అంతేకాకుండా.. ప్ర‌స్తుతం భారత్‌తో సిరీసే నాకు ముఖ్యమైంద‌ని.. పరుగులు చేయడమే నా ముందున్న టార్గెట్ అని అన్నాడు. అలాగే.. కోహ్లీ, రోహిత్‌ల రికార్డులను కూడా బ్రేక్‌ చేయాలని ఉందని అన్నాడు.

అయితే.. 2019 కాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాట్స్‌మ‌మెన్ జాబితాలో కోహ్లీ(1292), రోహిత్‌ శర్మ(1268)లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, షాయ్ హోప్‌(1225) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఓ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులుగా.. కోహ్లీ, రోహిత్‌ల రికార్డుల‌ను బ్రేక్ చేయాల‌ని ఉంద‌ని ముసిముసిగా నవ్వుతూ స‌మాధాన‌మిచ్చాడు.

అలాగే.. వారిద్ద‌రి రికార్డ్ బ్రేక్‌ చేయాలంటే… వారిని త్వ‌ర‌గా అవుట్ చేయాల‌ని మా బౌలర్లను అడుగుతానంటూ జోకు చేశాడు. వారిని ఎంత త్వ‌ర‌గా అవుట్ ఔట్‌ చేస్తే అంత త్వ‌ర‌గా రేసులోకి వస్తాన‌ని షాయ్ హోప్ అన్నాడు.

అలాగే.. నేనొక్క‌డినే 50 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండాలని అనుకోనని.. నేను మాత్ర‌మే 50 యాభై ఓవర్లు ఆడితే.. మా టీమ్‌లోని ఆట‌గాళ్లకు మరో 50 ఓవర్లు కావాలని.. అందుకే నాదృష్టంతా భారీ స్కోరు సాధించడంపైనే ఉంటుంద‌ని అన్నాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.