9 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

By సుభాష్  Published on  17 Dec 2019 12:46 PM GMT
9 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సభలో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రతి రోజు సభ మొదలైనప్పటి నుంచి గందరగోళంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలపై చర్చించడం కంటే వారివారి తిట్ల పురాణాలే అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నుంచి తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. సభకు ప్రతి రోజు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా ఒక్క రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నానని స్పీకర్‌ ప్రకటించారు.

ఏపీ రాజధానిపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగానికి టీడీపీ సభ్యులు ఆటంకం కలిగించారు. ఈ క్రమంలో బుగ్గన జోక్యం చేసుకొని, వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు కోరారు. దీంతో 9 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్‌ అయిన ఆ తొమ్మిది మంది సభ్యులు బయటకు వెళ్లాలని స్పీకర్‌ సూచించారు. సభ్యుల సస్పెన్షన్ సభలో ఎవరికీ ఇష్టం లేదని, సభ్యుల సస్పెన్షన్‌పై మనస్తాపానికి గురయ్యానని, కానీ తప్పని పరిస్థితుల్లో సస్పెండ్ చేయాల్సి వచ్చిందని స్పీకర్‌ అన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి.

సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు :

1. నిమ్మల రామానాయుడు

2. గద్దె రామ్మోహన్

3. అచ్చెన్నాయుడు

4. బెందలం అశోక్

5. ఏలూరి సాంబ శివరావు

6. వెలగపూడి రామకృష్ణ బాబు

7. అనగాని సత్య ప్రసాద్

8. బాల వీరంజనేయులు

9 మద్దల గిరి

Next Story