న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  2 Oct 2020 3:17 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.ఎమ్మెల్యే హత్య కేసులో 33 మంది మావోలపై చార్జిషీట్‌ దాఖలు

ఛత్తీస్‌గఢ్‌లో 2019లో జరిగిన ఎమ్మెల్యే భూమా మాండవి హత్యకు సంబంధించి మావోయిస్టుకు చెందిన 33 మంది క్యాడర్‌పై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎన్‌ఐఏ) చార్జీషీట్‌ దాఖలు చేసింది. భారతీయ శిక్షాస్మృతి, చట్ట విరుద్ద కార్యకలాపాలు చట్టం, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద జగదల్‌పూర్‌లోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో గురువారం ఈ చార్జిషీట్‌ దాఖలైంది. 33 మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేయగా, 22 మంది ఇంకా పరారీలో ఉన్నారు. మరో ఐదుగురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.‘బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌’ టీజ‌ర్ రిలీజ్‌‌.. హీరోయిన్‌గా ఆ యాంక‌ర్‌

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో దాదాపు ఆరునెల‌లుగా ఏ సినిమా విడుద‌ల‌కు నోచుకోలేదు. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ జారీ చేసిన నేఫ‌థ్యంలో.. థియేట‌ర్లు ఓపెన్ చేయోచ్చ‌నే సంకేతాలు ఇచ్చింది. దీంతో లాక్‌డౌన్‌కు ముందు ఆగిపోయిన‌, విడుద‌ల‌కు నోచుకోని చాలా చిత్రాలు ఒక్కొక్క‌టిగా ప‌ట్టాలెక్కుతున్నాయి. ఈ నెల 15నుండి థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.హేమంత్‌ హత్య కేసు: నిందితుల విచారణలో కీలక విషయాలు..!

హేమంత్‌ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడి మూడో రోజుకు చేరింది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డిలు పలు కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ప్రాణం కంటే పరువే ముఖ్యమని, అందుకే హేమంత్‌ను హతమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.రైనాకు సీఎస్‌కే షాక్‌.. ఇక రీఎంట్రీ క‌ష్ట‌మే..!

చెన్నై సూపర్‌కింగ్స్ సీనియర్‌ ఆటగాడు, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా ఐపీఎల్‌లో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రైనా జ‌ట్టును వీడ‌గా.. ఇక రైనా వైపు తిరిగిచూసే ప్రసక్తేలేదని ప్ర‌క‌టించి సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్ సంచ‌ల‌నానికి తెర‌లేపారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.గిరిజన సంక్షేమానికి పెద్ద పీట: సీఎం జగన్‌

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పట్టాల పంపిణీతో పాటు మరికొన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు జగన్‌ శ్రీకారం చుట్టారు. అలాగే పాడేరులో మెడికల్‌ కాలేజీ,.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.Fact Check : డ్రోన్ ద్వారా వస్తువుల సరఫరా.. రియాలిటీనేనా..!

లాక్ డౌన్ సమయాల్లో చాలా మంది బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో డోర్ డెలివరీ ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారు. డ్రోన్ ల ద్వారా సరుకులు డెలివరీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే చాలా సంస్థలు వెల్లడించాయి. అవి ఎంత వరకూ నిజమో తెలియడం లేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.భారత్‌లో 99,773 కరోనా మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 81,484 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,095 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ ..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.ఏంటీ బయో బబుల్.. నిబంధనలు అంత క‌ఠిన‌మా.?

బయో బబుల్ ఇప్పుడు ఎక్క‌వ‌గా విన‌ప‌డుతున్న మాట‌. ఐపీఎల్‌లో భాగంగా చెన్నై జట్టు ఆట‌గాడు‌ కేఎం ఆసిఫ్‌ బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో అత‌న్ని జ‌ట్టునుండి త‌ప్పించారు. అనంత‌రం ఆసిఫ్‌ను వెంటనే ఆరు రోజుల స్వీయ నిర్బంధంలోకి పంపారు. అనంత‌రం అతడికి కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా అందులో నెగెటివ్ రావ‌డంతో అత‌డు జ‌ట్టులో చేరాడు. దీంతో ఇప్పుడంతా ఏంటీ బ‌యో బ‌బుల్ అనే చ‌ర్చ జ‌రుగుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా నిర్ధారణ కావడంతో క్వారంటైన్‌కు వెళ్తున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ట్రంప్ సహాయకురాలు హోప్‌హిక్స్‌కు కరోనా సోకడంతో ట్రంప్‌కు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌తోపాటు మెలానియాకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, హోప్‌హిక్స్‌తో కలిసి రెండు రోజుల క్రితం ఓ ర్యాలీలో ట్రంప్‌ పాల్గొన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు ముమైత్‌ ఖాన్‌.. క్యాబ్‌ డ్రైవర్‌పై రియాక్షన్‌

సినీనటి ముమైత్‌ ఖాన్‌పై ఇటీవల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తనకు డబ్బులు చెల్లించలేదని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాబ్‌ డ్రైవర్‌ చేసిన ఆరోపణలను ముమైత్‌ ఖాన్‌ ఖండించింది. క్యాబ్‌ డ్రైవర్‌ను చీట్‌ చేయాల్సిన అవసరం నాకు లేదని, తనపై అతను తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించింది. అతనికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేశానని అన్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story