అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  2 Oct 2020 5:17 AM GMT
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా నిర్ధారణ కావడంతో క్వారంటైన్‌కు వెళ్తున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ట్రంప్ సహాయకురాలు హోప్‌హిక్స్‌కు కరోనా సోకడంతో ట్రంప్‌కు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌తోపాటు మెలానియాకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, హోప్‌హిక్స్‌తో కలిసి రెండు రోజుల క్రితం ఓ ర్యాలీలో ట్రంప్‌ పాల్గొన్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణం, మరోవైపు అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో ట్రంప్‌కు కరోనా వచ్చింది. అయితే చిన్న విరామం కూడా తీసుకోకుండా శ్రమిస్తున్న ట్రంప్‌ సహాయకురాలు హోప్‌ హిక్స్‌ కరోనా బారిన పడటంతో ట్రంప్‌ దంపతులకు పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ముందే ఎన్నికల వేడి ఉండటం, ట్రంప్‌కు కరోనా సోకడంతో పార్టీ వర్గాల్లో అలజడి నెలకొంది.Next Story