ఢిల్లీలో 144 సెక్షన్‌

By సుభాష్  Published on  2 Oct 2020 4:52 AM GMT
ఢిల్లీలో 144 సెక్షన్‌

దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్‌ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ 144 ప్రకారం ఐదుగురికంటే ఎక్కువ మంది ఒక చోట చేరవద్దని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సెక్షన్‌ ఉన్న కారణంగా ఇండియాగేట్‌ వద్ద ప్రజలను అనుమతించమని తెలిపారు.

ఢిల్లీ వ్యాప్తంగా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఢిల్లీ డీసీపీ ట్వీట్‌ చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ జిల్లాలో సామూహిక హత్యాచార ఘటనపై కాంగ్రెస్‌ నిరసనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యంగా బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళ్తుండగా, రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రాను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ ఇండియా గేటు వద్ద కొత్త వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ట్రాక్టర్‌ను దహనం చేసిన విషయం తెలిసిందే. కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే నగరంలో భారీ భధ్రతను కట్టుదిట్టం చేశారు. ఇండియా గేట్‌ వద్ద సాయుధ పోలీసు పహరా కాస్తున్నారు.

Next Story