పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు ముమైత్‌ ఖాన్‌.. క్యాబ్‌ డ్రైవర్‌పై రియాక్షన్‌

By సుభాష్  Published on  2 Oct 2020 4:05 AM GMT
పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు ముమైత్‌ ఖాన్‌.. క్యాబ్‌ డ్రైవర్‌పై రియాక్షన్‌

సినీనటి ముమైత్‌ ఖాన్‌పై ఇటీవల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తనకు డబ్బులు చెల్లించలేదని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాబ్‌ డ్రైవర్‌ చేసిన ఆరోపణలను ముమైత్‌ ఖాన్‌ ఖండించింది. క్యాబ్‌ డ్రైవర్‌ను చీట్‌ చేయాల్సిన అవసరం నాకు లేదని, తనపై అతను తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించింది. అతనికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేశానని అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి క్యాబ్‌ డ్రైవర్‌పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన అనంతరం ముమైత్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడారు. క్యాబ్‌ డ్రైవర్‌ నాపై చేసిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ఆ డ్రైవర్‌ను చీట్‌ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా ఛానళ్లు నా పరువుకు భంగం కలిగించేలా చేశాయి. డ్రైవర్‌ చెప్పినదాంట్లో ఎలాంటి నిజం లేదు. అతను ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ నన్ను భయాందోళనకు గురి చేశాడు. అతనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాను..అని చెప్పారు.

అలాగే క్యాబ్‌ డ్రైవర్‌కు ఇవ్వాల్సిన రూ.23,500 అప్పుడే చెల్లించేశాను. ఆ ఆధారాలు కూడా పోలీసులకు అందజేశాను. నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్‌ ఏంటో, ఎలాంటి దానినో అందరికి తెలుసు. టోల్‌గేట్‌ ఛార్జీలు కూడా ఇవ్వలేదని క్యాబ్‌ డ్రైవర్‌ చెప్పడం అంతా అబద్దం. ఆ డబ్బులు కూడా నేనే చెల్లించాను అంటూ మీడియాతో తెలిపింది. అలాగే అతనికి చెల్లించిన ఛార్జీలకు సంబంధించి పత్రాలను సైతం మీడియాకు చూపించింది.

కాగా, ముమైత్‌ ఖాన్‌ హైదరాబాద్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ ను ఇటీవల డబ్బులు ఇవ్వలేదని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మూడు రజుల గోవా ట్రిప్‌ కోసం తన క్యాబ్‌ బుక్‌ చేసుకుని మరో ఐదు రోజులు అదనంగా క్యాబ్‌ను వాడుకుందని ఆయన ఆరోపించాడు. అందుకు గాను డబ్బులు కూడా చెల్లించలేదని, కనీసం టోల్‌ ఛార్జీలు ఇవ్వలేదని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. ముమైత్‌ ఖాన్‌ నుంచి తనకు ఇంకా రూ.15వేలు రావాల్సి ఉందని, తనకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ముమైత్‌ ఖాన్‌తో దిగిన ఫోటోలు, టోల్‌ ఛార్జీల రిసిప్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. క్యాబ్‌ డ్రైవర్‌ అసోసియేషన్‌లో చర్చించాక ముమైత్‌ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో ముమైత్‌ ఖాన్‌ స్పందించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Mumaith Khan Files Complaint Against Cab Driver1

Next Story