'బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌' టీజ‌ర్ రిలీజ్‌‌.. హీరోయిన్‌గా ఆ యాంక‌ర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2020 8:58 AM GMT
బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ టీజ‌ర్ రిలీజ్‌‌.. హీరోయిన్‌గా ఆ యాంక‌ర్‌

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో దాదాపు ఆరునెల‌లుగా ఏ సినిమా విడుద‌ల‌కు నోచుకోలేదు. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ జారీ చేసిన నేఫ‌థ్యంలో.. థియేట‌ర్లు ఓపెన్ చేయోచ్చ‌నే సంకేతాలు ఇచ్చింది. దీంతో లాక్‌డౌన్‌కు ముందు ఆగిపోయిన‌, విడుద‌ల‌కు నోచుకోని చాలా చిత్రాలు ఒక్కొక్క‌టిగా ప‌ట్టాలెక్కుతున్నాయి. ఈ నెల 15నుండి థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో.. ఆ సినిమాల‌కు సంబంధించి ట్రైల‌ర్‌లు, టీజ‌ర్లు, ప‌స్ట్‌లుక్ అంటూ మ‌ళ్లీ సంద‌డి మొద‌లైంది.

తాజాగా.. నందు‌, జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్‌ ర‌ష్మీ గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ టీజ‌ర్ రిలీజైంది. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ ప‌గ‌డాల నిర్మించాడు. ఈ సినిమాలో నందు పోతురాజు పాత్రలో, పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు.

ఇక‌పోతే ఈ సినిమాలో నందు, ర‌ష్మీల పాత్ర‌లు ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. రష్మీ, నందుల‌ లవ్ ‌సీన్స్ ఇంట్రెస్ట్‌గా ఉంటాయ‌ని చిత్ర‌బృందం అంటోంది‌. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే చిత్ర‌ టైటిల్ కి త‌గ్గ‌ట్లుగానే సినిమా కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ప‌క్క‌గా ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. నందు చివ‌రిగా స‌వారి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌లేకపోయింది.

Next Story