నితిన్‌ కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 12:41 PM GMT
నితిన్‌ కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్‌

'భీష్మ' చిత్రంతో ఈ ఏడాది మంచి హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో నితిన్‌. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రంగ్‌దే సినిమా షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. ఇక వైవిద్య కథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శతక్వంలో నితిన్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

గురువారం ఈ సినిమాకి సంబంధించి ప్రీలుక్‌-టైటిల్‌ను స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి 'చెక్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘నాకు ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర​ యేలేటి, హీరో నితిన్‌ల కొత్త సినిమా ప్రీ లుక్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు కొరటాల. ప్రీలుక్‌లో నితిన్‌ చేతికి సంకెళ్లు ఉండగా.. టేబుల్‌పై చదరంగం పావులు, కంచె ఉన్నాయి. మరి ఈ చదరంగం ఆటలో ఎవరు ఎలాంటి పావులు కదిపారు..? ఎవరు చెక్‌మేట్‌ చెప్పారు..? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.Next Story