భారత్‌లో 99,773 కరోనా మరణాలు

By సుభాష్  Published on  2 Oct 2020 7:03 AM GMT
భారత్‌లో 99,773 కరోనా మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 81,484 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,095 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 63,94,609 ఉండగా, మరణాల సంఖ్య 99,773కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,42,217 ఉండగా, చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 53,52,078కు చేరింది. గడిచిన 24 గంటల్లో 10,97,7474 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు మొత్తం 7,67,17,728 నిర్ధారణ పరీక్షలు చేశారు.

కాగా, కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. లాక్‌డౌన్‌ విధించి కఠినమైన చర్యలు చేపట్టినా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించింది. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. ప్రజలే కాకుండా ప్రభుత్వాలు సైతం ఆర్థికంగా తీవ్ర స్థాయిలో దెబ్బ తిన్నాయి. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు.

Next Story