Newsmeter: టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  25 Aug 2020 7:44 AM GMT
Newsmeter: టాప్‌ 10 న్యూస్‌

హైదరాబాద్‌: జంట పేలుళ్లకు 13 ఏళ్లు

గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కు బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్ల పూర్తయింది. 2007 ఆగస్టు 25న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు సాయంత్రం రెండు నిమిషాల వ్యవధిలోనే లుంబినీ పార్క్‌ లేజర్‌ షో వద్ద , కోఠిలోని గోకుల్‌చాట్‌ వద్ద జంట పేలుళ్లు జరిగాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

పెట్రోల్‌ బంక్‌లో దారుణ హత్య

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాల్కొండ శివారులోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో రామకృష్ణ (50) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ అనే వ్యక్తి పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ఉసేన్ బోల్ట్‌ కు కరోనా.. ఆందోళనలో క్రిస్‌గేల్‌..!

ప్రపంచంలోని వేగవంతమైన రన్నర్‌, ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా స్పింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. బోల్ట్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

కరోనా సోకిందని.. ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్‌ నేత..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ వ్యాప్తి ఆగడం లేదు. చిన్నా-పెద్దా, పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరికి ఈ మహమ్మారి సోకుతోంది. తాజాగా కడప జిల్లాలో విషాదం ఘటన చేసుకుంది. కరోనా సోకిందని కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి(55) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ఆ వెంట‌నే కొత్త అధ్యక్షుడు వ‌స్తారు : చిదంబరం

రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఏఐసీసీ ఎన్నికలు జరుగుతాయని.. అవి పూర్తవ‌గానే నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వెల్లడించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

రేషన్‌ బియ్యం వద్దంటే డబ్బులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది జగన్‌ సర్కార్‌. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సమాలోచన చేస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

దడ పుట్టించే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పిన హాంగ్ కాంగ్

కరోనా వైరస్ నుండి కోలుకున్న కొన్ని నెలలకే మళ్లీ కరోనా వైరస్ సోకిన ఘటన హాంగ్ కాంగ్ లో చోటుచేసుకుంది. ఏప్రిల్ నెలలో కరోనా వైరస్ నుండి కోలుకున్న 33 సంవత్సరాల వ్యక్తికి మళ్లీ కరోనా సోకింది. యూరప్ నుండి హాంగ్ కాంగ్ కు వచ్చిన సదరు వ్యక్తిని ఎయిర్ పోర్టులో పరిశీలించగా SARS-CoV-2 రెండో సారి సోకిందని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

విశాఖ: కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

విశాఖలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొమ్మాది శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలోని కంప్యూటర్‌ ల్యాబ్‌లో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ప్రపంచంలో ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,38,00,692 కరోనా కేసులు నమోదు కాగా, .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

కరోనా దెబ్బకు ఆ సంపన్న దేశం 70 ఏళ్లు వెనక్కి వెళ్లిందట.!

ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థ.. బుల్లిదేశమే అయినా.. సంపన్న దేశంగా పేరున్న జపాన్ కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఆ దేశం ఆర్థికంగా 70 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్లుగా అంచనా వేస్తున్నారు. వైరస్ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న క్షీణత.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Next Story