రేషన్‌ బియ్యం వద్దంటే డబ్బులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..!

By సుభాష్  Published on  25 Aug 2020 4:27 AM GMT
రేషన్‌ బియ్యం వద్దంటే డబ్బులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది జగన్‌ సర్కార్‌. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సమాలోచన చేస్తోంది.

తెలుగుదేశం ప్రభుత్వం విరమించుకున్న నగదు బదిలీ విధానాన్ని ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎవరైన లబ్దిదారు రేషన్‌ బియ్యం వద్దనుకుంటే .. దానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని భావిస్తోందట. ఇందుకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సును జగన్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టే అవకాశాలున్నట్లు సమాచారం. కిలో బియ్యానికి రూ.25 నుంచి 30 వరకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story
Share it