అన్‌లాక్‌ 4.0: మెట్రో సేవలకు కేంద్రం అనుమతి ఇవ్వనుందా..?

By సుభాష్  Published on  24 Aug 2020 2:07 PM GMT
అన్‌లాక్‌ 4.0: మెట్రో సేవలకు కేంద్రం అనుమతి ఇవ్వనుందా..?

కరోనా కారణంగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 31తో అన్‌లాక్‌ 3.0 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్‌ 4.0కు సంబంధించిన కొత్త నియమ నిబంధనలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అన్‌లాక్‌ 4.0ను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు హోంశాఖ వర్గాల ద్వారా సమాచారం. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి మెట్రో సేవలను అనుమతించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరో వైపు వీటితో పాటు మరికొన్ని ప్రజారవాణా, ఇతర సేవలకు అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే పాఠశాలలు, కళాశాలలు ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలేమి కనిపించడం లేదని తెలుస్తోంది. అలాగే బార్లను తెరవకుండానే మద్యాన్ని మాత్రమే తీసుకెళ్లందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే మెట్రో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మెట్రో ప్రారంభం అంశం తెరపైకి రావడం గమనార్హం.

Next Story
Share it