రాహుల్‌ను అధ్యక్షుడిని చేయండి.. ర‌క్తంతో సోనియాకు లేఖ రాసిన నేత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Aug 2020 1:16 PM GMT
రాహుల్‌ను అధ్యక్షుడిని చేయండి.. ర‌క్తంతో సోనియాకు లేఖ రాసిన నేత‌

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీని తిరిగి అధ్యక్షుడిని చేయాల‌ని పార్టీకి చెందిన ఓ నేత సోనియా గాంధీకి రక్తంతో లేఖ రాశారు. వివ‌రాళ్లోకెళితే.. ఢిల్లీ కాంగ్రెస్ నేత, కంటోన్మెంట్ బోర్డ్‌ కౌన్సిలర్ సందీప్ తన్వార్ ర‌క్తంతో రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఓ ప‌క్క సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జ‌రుగుతుండ‌టం.. మ‌రోప‌క్క సందీప్ తన్వార్ లేఖ బ‌య‌ట‌కు రావ‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్లో తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సందీప్ తన్వార్ లేఖ‌లో.. శ్రీమతి సోనియా గాంధీ గారు.. రాహుల్ గాంధీని పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమించాలని రక్తతర్పణం చేసి అడుగుతున్నాను. రాహుల్‌ గాంధీ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశంలో ఎన్నో గొంతుకలు నినదిస్తున్నాయి. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియ‌మించ‌క‌పోతే కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రమూ మేలు జ‌రుగ‌దని రాసుకోచ్చాడు.

R1

ఇదిలావుంటే.. ఈ ఉదయం పది గంటలకు మొదలైన‌ కాంగ్రెస్ సీడ‌బ్ల్యూసీ సమావేశం సుదీర్ఘంగా సాగింది. 7 గంటల పాటు కొనసాగిన సమావేశం కొద్దిసేప‌టి క్రిత‌మే ముగిసింది. ఉదయం నుంచి అనేక పరిణామాలు, వాదనలు, ప్రతివాదనలు, అలకలు బుజ్జగింపులు మధ్య సాగిన‌.. ఈ సమావేశం చివరకు అధ్యక్ష మార్పు లేకుండానే ముగిసింది. మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it