ప్రపంచంలో ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు

By సుభాష్  Published on  25 Aug 2020 2:14 AM GMT
ప్రపంచంలో ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,38,00,692 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 8,16,534 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి ఇప్పటి వరకు 1,63,47,834 కోలుకున్నట్లు ప్రపంచ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఏ దేశంలో ఎన్ని కేసులు..

► భారత్‌లో 31,06,348 పాజిటివ్‌ కేసులుండగా, 57,542 మంది మృతి చెందారు.

► అమెరికాలో 59,14,682 పాజిటివ్‌ కేసులుండగా, 1,81,097 మంది మృతి చెందారు.

► బ్రెజిల్‌లో 36,27,217 పాజిటివ్‌ కేసులుండగా, 1,15,451 మంది మృతి చెందారు.

► రష్యాలో 9,61,493 కరోనా పాజిటివ్‌ కేసులుండగా, 16,448 మంది మృతి చెందారు.

► పెరూలో 6,00,438 పాజిటివ్‌ కేసులుండగా, 27,813 మంది మంది మృతి చెందారు.

► మెక్సికోలో 5,60,164 పాజిటివ్‌ కేసులుండగా, 60,480 మంది మృతి చెందారు.

► స్పెయిన్‌లో 4,20,809 పాజిటివ్‌ కేసులుండగా, 28,872 మంది మృతి చెందారు.

► చిలీలో 3,99,568 పాజిటివ్ కేసులుండగా, 10,916 మంది మృతి చెందారు.

► ఇరాన్‌లో 3,61,150 పాజిటివ్‌ కేసులుండగా, 20,776 మంది మృతి చెందారు.

► సౌదీ ఆరేబియాలో 3,08,654 పాజిటివ్‌ కేసులుండగా, 3,694 మంది మృతి చెందారు.

► పాకిస్థాన్‌లో 2,93,261 పాజిటివ్‌ కేసులుండగా, 6,244 మంది మృతి చెందారు.

► ఇటలీలో 2,60,298 పాజిటివ్‌ కేసులుండగా, 35,441 మంది మృతి చెందారు.

► టర్కీలో 2,59,692 పాజిటివ్‌ కేసులుండగా, 6,139 మంది మృతి చెందారు.

► జర్మనీలో 2,36,117 పాజిటివ్‌ కేసులుండగా, 9,336 మంది మృతి చెందారు.

Next Story