హైదరాబాద్‌: జంట పేలుళ్లకు 13 ఏళ్లు

By సుభాష్  Published on  25 Aug 2020 7:05 AM GMT
హైదరాబాద్‌: జంట పేలుళ్లకు 13 ఏళ్లు

గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కు బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్ల పూర్తయింది. 2007 ఆగస్టు 25న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు సాయంత్రం రెండు నిమిషాల వ్యవధిలోనే లుంబినీ పార్క్‌ లేజర్‌ షో వద్ద , కోఠిలోని గోకుల్‌చాట్‌ వద్ద జంట పేలుళ్లు జరిగాయి. ఈ దారుణ ఘటనలో 42 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ జంట పేలుళ్లు జరిగి నేటితో 13 ఏళ్లు పూర్తికావడంతో బలైన కుటుంబాలు ఇంకా మర్చిపోలేకపోతున్నాయి. అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే.

పేలుళ్లు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించి 19 బాంబులను నిర్వీర్యం చేశారు. పేలుళ్ల వల్ల గాయపడిన వారిలో కొందరు ఇప్పటికి కోలుకోలేదు. ఆనాటి భయంకరమైన పరిస్దితులను గుర్త చేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, పేలుళ్లుకు పాల్పడిన నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది.

ఎన్‌ఐఏ కోర్టు దర్యాప్తు అనంతరం ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులకు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న హానిక్‌ షఫిక్‌ సయ్యద్‌, ఏ-2 మహమ్మద్‌ ఇస్మాయిల్‌ చౌదరిలను దోషులుగా తేల్చింది ఎన్‌ఐఏ కోర్టు. అయితే శిక్ష ఖరారు చేసినప్పటికీ వివిధ కారణంగా చేత ఇప్పటికి తీర్పు అమలు కాలేదు. ఈ జంట పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిద్దీన్‌ సంస్థ హతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మక్కా పేలుళ్ల అనంతరం పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

Next Story