పెట్రోల్‌ బంక్‌లో దారుణ హత్య

By సుభాష్  Published on  25 Aug 2020 6:36 AM GMT
పెట్రోల్‌ బంక్‌లో దారుణ హత్య

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాల్కొండ శివారులోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో రామకృష్ణ (50) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ అనే వ్యక్తి పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నారు. ఒక్కడే విధుల్లో ఉన్న రామకృష్ణ.. అర్ధరాత్రి వాహనాల రాకపోకలు పెద్దగా లేకపోవడంతో అక్కడే ఉన్న క్యాబిన్‌లో నిద్రించాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రామకృష్ణపై బండరాయితో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో రామకృష్ణ తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు.

అయితే మంగళవారం తెల్లవారుజామున అటునుంచి వెళ్తున్న వాహనదారులు రామకృష్ణను గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలాన్ని ఆర్మూర్‌ సీఐ ఉదయ్‌ కుమార్‌, ఎస్సై శ్రీహరిలు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు రామకృష్ణను చంపిందెవరు.. ? ఎందుకు చంపారు..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it