కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ

తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు.

By Knakam Karthik
Published on : 26 Aug 2025 11:19 AM IST

Telangana, Minister Tummala Nageshwar rao, Farmers, Urea Shortage, Central Government, Bjp, Congress, Brs

కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ

తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో యూరియా కొరత పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిందిస్తూ సాగుతున్న రైతుల ఆందోళనలు, చెప్పులు పెట్టీ క్యూ లైన్ లు ఉండటంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్లో వాస్తవాలు ఏమిటి? యూరియా కొరతకు కారణాలు ఏమిటి? వాస్తవాలు దాచి పెట్టే పెద్దలు ఎవ్వరు? రైతుల ముసుగులో ప్రేరేపిత ఉద్యమాలు చేసే పార్టీలు ఏవీ? వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రైతన్నలకు వాస్తవాలు తెలియజేయాలని ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను..అని తుమ్మల పేర్కొన్నారు.

తెలంగాణ లో యూరియా కొరతకు రెండు ప్రధాన కారణాలు. మొదటిది మన రాష్ట్రానికి దిగుమతి ద్వారా కేటాయించిన యూరియా ప్రపంచ వ్యాప్తంగా జియో పాలిటిక్స్ నేపథ్యంలో సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాల వల్ల రెడ్ సీ లో నౌకాయనం నిలిచిపోయి రాష్ట్రానికి రాలేదు. ఆగస్టు వరకు మన రాష్ట్రానికి దిగుమతి ద్వారా 3.94 LMTల యూరియాను కేంద్రం కేటాయించింది. ఇందులో CIL కంపెనీ ద్వారా.. ఏప్రిల్‌లో 30,000, మేలో 61,000, జూన్‌లో 60,000, జులైలో 57,800, ఆగస్టులో 28,800.. IPL కంపెనీ ద్వారా ఏప్రిల్‌లో 10,800, మేలో 50,000, జూన్‌లో 20,000, జులైలో 13,050, ఆగస్టులో 10,800.. KRIBHCO కంపెనీ ద్వారా జూన్‌లో 20,000, జులైలో 10,400..NFL కంపెనీ ద్వారా జూన్ లో 7,950, జులై లో 15,900 LMTs కేటాయించారు.

వాస్తవాలు దాస్తున్న కేంద్ర ప్రభుత్వం

దేశీయంగా యూరియాకు ఉన్న డిమాండ్ మరియు ఉత్పత్తికి మధ్య గ్యాప్ ఉండటంతో.. చైనా, రష్యా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకుంటాం. ఒక్క చైనా నుంచే 7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ చైనా నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి కావల్సిన యూరియా నిలిచిపోవడం, దేశీయంగా డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేక దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. దేశంలో ఎక్కడాలేని యూరియా కొరత, మన రాష్ట్రంలోనే ఎలా ఉంటుంది అని బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బిజెపి పాలిత ప్రాంతాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉందనే విషయాన్నీ ఎందుకు దాస్తున్నారు? అక్కడి రైతాంగం కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు కదా.! కేవలం మన రాష్ట్రంలోనే ఉందని ఎందుకు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు?..అని తుమ్మల ప్రశ్నించారు.

కేంద్రప్రభుత్వం యూరియా సరఫరా చిత్తశుద్ది పాటించి ఉంటే ఇతర రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఏర్పడింది. ఇలాంటి వాస్తవాలు అన్ని కేంద్ర ప్రభుత్వం, ఇక్కడి బిజెపి నాయకులు ఎందుకు దాస్తున్నారు? ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన యూరియాను, కేంద్ర అసమర్థతతో దిగుమతి చేసుకోలేక, వారి అసమర్థతను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజేపి నాయకులు వాస్తవాలు చెప్పకుండా రాజకీయ విమర్శలు చేయటం సమంజసమేనా ఆత్మ విమర్శ చేసుకోవాలి. రైతాంగానికి వాస్తవాలు ఎందుకు చెప్పరు? ఇంపోర్ట్ లేక యూరియా కొరత ఉందనే వాస్తవాలు తెలపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పై అక్కసుతో ఇలాంటి విమర్శలు చేయటం రైతాంగంకు తెలియదు అనుకుంటున్నారా? యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై లెక్కలతో సహా రైతులకు ప్రభుత్వం తెలిపినందున మీ భాగోతం ఇప్పుడు బయట పడింది కదా..అని లేఖలో పేర్కొన్నారు.

Next Story