బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఎపిసోడ్ ముగిసింది. ఆమె విషయంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక చర్చ అవసరం లేదు. పార్టీ ఫిరాయింపుల విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అప్రూవర్‌గా మారారు. కాంగ్రెస్ అధ్యక్షుడే అప్రూవర్‌గా మారాక. ఇక విచారణ ఎందుకు?. కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి ఒప్పుకున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతుంటే...ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైతులను బీజేపీ, కాంగ్రెస్ మోసం చేసినందునే.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నాం..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.