రేవంత్‌రెడ్డికి జాతి, నీతి ఏమైనా ఉందా?..హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By - Knakam Karthik |
రేవంత్‌రెడ్డికి జాతి, నీతి ఏమైనా ఉందా?..హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రేపు ఏపార్టీలో ఉంటాడో తెలియదు. రేవంత్ రెడ్డికి నీతి జాతి ఏమైనా ఉందా? కేసీఆర్ స్టేట్స్ మన్ లా మాట్లాడితే.. రేవంత్ స్ట్రీట్ రౌడీ మాదిరి మాట్లాడారు. త్యాగాల చరిత్ర మాది.. వెన్నుపోటుకు మారు పేరు రేవంత్ రెడ్డి. సంకుచిత, మరగుజ్జు మనస్తత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరిస్తున్నారు. రేవంత్‌ను తెలంగాణ ద్రోహిగా.. కేసీఆర్ ప్రజల ముందు నిలబెట్టారు. కేసీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సీఎం, నీళ్ల మంత్రికి ఎందుకుత నొప్పి? ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారు. 45టీఎంసీలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉత్తర కుమారుడిలా మిగిలిపోయాడు. కాంగ్రెస్ అనుభవమంతా దోపిడికి, లూటీకి పనికొస్తుంది..అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేను కొంటూ 50 లక్షలతో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. 50 కోట్లకు రేవంత్ పీసీసీ పదవి కొనుకున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పారు. రేవంత్‌కు ఒక స్టాండ్, సిద్దాంతం పద్ధతి లేదు. ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కేసీఆర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్స్ నిర్వహించాలి. నీళ్ల మంత్రి ఉత్తమ్‌కు సగం సగం నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఎస్‌ఎల్‌బీసీ కుప్పకూలి ఎనిమిది మంది చనిపోతే వాళ్ల మృతదేహాలను బయటికి తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎవరి హయాంలో ఎంత పని జరిగిందో చూద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా సవాల్ చేస్తున్నా..అని హరీశ్ రావు పేర్కొన్నారు.