ముందు రాహుల్ గాంధీని ఉరితీయాలి..కేటీఆర్ సంచలన కామెంట్స్

అధికార మదంతో సీఎం రేవంత్ రెడ్డి బలుపు మాట్లాతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు.

By -  Knakam Karthik
Published on : 4 Jan 2026 2:22 PM IST

Telangana, Hyderabad, Ktr, Brs, Congress, Kcr, Cm Revanthreddy, Rahulgandhi

ముందు రాహుల్ గాంధీని ఉరితీయాలి..కేటీఆర్ సంచలన కామెంట్స్

హైదరాబాద్: అధికార మదంతో సీఎం రేవంత్ రెడ్డి బలుపు మాట్లాతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో నదీ జలాలు, కాంగ్రెస్ ద్రోహులు పేరుతో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..సర్వబ్రష్ట నాయకుడు రేవంత్ రెడ్డి. ఉరి తీయాల్సి వస్తే రాహుల్ గాంధీని అశోక్ నగర్, వరంగల్ లో ఉరి తియ్యాలి. శాసన సభ కొనసాగుతున్న పద్దతి సరిగలేదు. వినాశకాలే విపరీత బుద్ధిలా ముఖ్యమంత్రి వ్యహరిస్తున్నారు. తెలంగాణ కోస చావు నోట్లో తల పెట్టీన వ్యక్తి కేసీఆర్. తెలంగాణను అన్నపూర్ణగా నిలిపిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ ను , హరీష్ రావును ఉరి తియ్యాలని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. ఉరి తీయాల్సి వస్తే తెలంగాణ ప్రజలను మోసం చేసిన రాహుల్ గాంధీనీ ఉరి తియ్యాలి. కాంగ్రెస్ చేసిన తప్పిదాలకు కాంగ్రెస్ పార్టీనీ ఎన్ని సార్లు ఉరి తీసిన తప్పులేదు..అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

నిరుద్యోగులను మోసం చేసినందుకు అశోక్ నగర్ లో రాహుల్ గాంధీని ఉరి తియ్యాలి. రైతులను మోసం చేసినందుకు వరంగల్ లో రాహుల్ గాంధీనీ ఉరి తియ్యాలి. అర్భకుడు చేతిలో తెలంగాణ బంధి అయింది. కాంగ్రెస్ పార్టీ కుక్క మూతి పిందే అని ఆనాడే ఎన్టీఆర్ అన్నాడు. రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా దోచుకోవడమే, రైతులను, ఆటో డ్రైవర్లు, గురుకుల విద్యార్థులను రేవంత్ రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. కేసీఆర్ స్థాయిని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తగ్గించలేడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ , టిడిపి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాయి..అని కేటీఆర్ ఆరోపించారు.

Next Story