దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు..రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్
రాష్ట్రానికి ఎక్కడా అప్పుడు ఇవ్వడం లేదని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik
దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు..రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్
తండ్రి లాంటి ముఖ్యమంత్రి సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టడం స్వతంత్ర భారతదేశంలో లేదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రాష్ట్రానికి ఎక్కడా అప్పుడు ఇవ్వడం లేదని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలోనేఊ అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగుల త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంత కూడా తెలియదు. తెలంగాణ ఎన్జీవోల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ వచ్చింది. ఉద్యోగులకు కేసీఆర్ 73 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఉద్యోగాలు పోయినా.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులపై ముఖ్యమంత్రి మాటలు బాధాకరం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారు. ప్రజల ముందు ఉద్యోగులను విలన్‌లుగా చిత్రీకరించే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అందాల పోటీలకు రూ.200 కోట్లు ఉన్నాయి కానీ.. ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా?..అని సీఎం రేవంత్‌ను కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు మోసం. నాయకత్వ లోపం.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పెట్టిన శాపం. వ్యక్తిగతంగా మాపై రోత మాటలను సైతం పడ్డాం.. తెలంగాణను శపిస్తే సహించం. వేల మంది త్యాగాలతో ఏర్పాడిన తెలంగాణను అవమానించే విధంగా రేవంత్ మాట్లాడుతున్నారు. పరిపాలన చేతకాదని.. రేవంత్ రెడ్డి కాడి పడేశాడు. నోట్ల కట్లతో దొరికిన రేవంత్ రెడ్డి.. దొంగ కాక మరేంటి?. రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే.. అప్పు పుట్టడం లేదు. కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ.. దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. రేవంత్‌ను సీఎం చేసి.. ఏఐసీసీ, రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేశారు. తెలంగాణ భవిష్యత్తుకు శాపం పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ పార్టీలను నమ్మితే మోసపోతామన్న కేసీఆర్ మాటలు నిజమయ్యాయి. ఇంత దివాలాకోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. అధికారంలోకి వస్తామని.. కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు. అందుకే విచ్చలవిడిగా హామీలు ఇచ్చింది..కేటీఆర్ విమర్శించారు.