టీడీపీ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 10 March 2020 7:45 PM IST

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. టీడీపీ తరఫున వర్ల రామయ్యను బరిలో దింపుతున్నామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల నేఫథ్యంలో.. టీడీపీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని, పార్టీ ఏజెంట్‌కు చూపించి ఓటేయాలని స్పష్టం చేశారు.
Also Read
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది వీళ్లే!పార్టీ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు. అటు, వైసీపీ ఇప్పటికే తన నలుగురు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు మండలి రద్దు నేఫథ్యంలో రాజ్యసభ అవకాశం కల్పించగా, వ్యాపారవేత్త అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీ ఏపీ నుంచి రాజ్యసభ బరిలో ఉన్నారు.
Next Story