సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన పరిమల్‌ నత్వాని

తనకు రాజ్యసభ సీటు కేటాయించడంపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ ధన్యవాదాలు తెలిపారు. సోమవారం సాయంత్రం ట్వట్టిర్‌ వేదికగా ఆయన స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ వైఎస్సార్‌సీపీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తాను’ అని నత్వానీ ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్‌ను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ ట్వీట్‌ను ప్రధాని కార్యాలయం, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు జోడించారు.

పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుకానుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు.


Vamshi Kumar Thota