న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Nov 2019 4:00 PM GMT
న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్

1. వైద్యురాలి హత్యకేసు: రిమాండ్‌ రిపోర్టులో సంచలన నిజాలు

తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలు హత్య తీవ్ర సంచనలంగా మారింది. నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, డాక్టర్‌ హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి. బైక్‌ టైర్‌ పంక్చర్‌ చేపిస్తామని స్కూటీని తీసుకెళ్లిన ఆరిఫ్‌ ఎంతకీ తిరిగి రాకపోవడంతో వైద్యురాలు తన మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. వెటర్నరీ డాక్టర్ హత్య కేసులో నిందితుల రిమాండ్‌

హైదరాబాద్‌: వెటర్నరీ డాక్టర్ హత్య కేసులో నిందితులకు14 రోజుల రిమాండ్ విధించారు. తాజాగా ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన షాద్‌నగర్‌ పోలీసులు వారిని మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట హాజరుపర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

3. చర్లపల్లి జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత….రంగంలోకి దిగిన పోలీసులు

తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలి హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు అరెస్టు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

4. స‌చిన్‌, సెహ్వాగ్, కోహ్లీ.. అంద‌రి రికార్డ్‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టిన స్మిత్..!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ కేవ‌లం 36 పరుగులకే ప‌రిమిత‌మైనా… సచిన్, సెహ్వాగ్ ల‌ పేరిట ఉన్న‌ రికార్డులను బ‌ద్ద‌లుకొట్టాడు. టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలోనే 7వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

5. జగన్ పాలనకు నేటితో ఆర్నేళ్లు…!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తన పాదయాత్రల పేరుతో తిరుగుతూ ప్రతి ఒక్కరిలో గుర్తిండిపోయేలా చేశాడు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ.. ఏపీ ప్రజల్లోకి వెళ్లి తిరుగులేని విజయం సాధించాడు వైఎస్‌ జగన్‌. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. న‌వంబ‌ర్ 30 నాటికి ఆయన పాలనకు ఆరు నెల‌లు పూర్తి అవుతోంది. మాట తప్పను… మడమ తిప్పను అని చెప్పుకునే జగన్… ఈ ఆరు నెలల్లోనే పాలనపరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

6. బాల ‘డేటా’ సైంటిస్ట్ బహుపరాక్..!!

లుడో, స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడుకునే వయసు ఆ బుజ్జాయిది. బుద్ధిగా బడికి వెళ్లి, వచ్చి, హోం వర్కు చేసి, బజ్జునే వయసు ఆ బుల్లోడిది. కానీ ఆ పాలుకారే పసివాడు ఏకంగా డేటా సైన్స్ సముద్రాన్ని శోధించి, ఒక చక్కటి ఉద్యోగాన్ని సాధించాడు. పట్టుమని పన్నెండేళ్లు కూడా లేకుండానే ప్లమ్ జాబ్ పొందేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

7. ప్రధాని మోదీ ఆరు నెలల పాలన ఎలా ఉందంటే..?

ఢిల్లీ: భారతదేశ ప్రధానిగా రెండోసారి 2019 మే 30న నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పరిపాలన నేటితో ఆరు నెలలు పూర్తి చేసుకుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి, ప్రధానమంత్రి పదవిని అలంకరించి మొదటి వ్యక్తి నరేంద్రమోదీ. 2014 నుంచి 2019 వరకు దేశ ప్రధానిగా మోదీ మొదటి సారి బాధ్యతలు నిర్వర్తించారు. 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

8. బ్రిటీష్‌ కాలంలోని చట్టాలకు త్వరలో మార్పు:మంత్రి కిషన్‌ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ వైద్యురాలు హత్య కేసు సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు ఈ అంశంపై ఖండిస్తున్నారు. ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రతిఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

9. కొర‌టాల‌ను టెన్ష‌న్ పెడుతున్న కొణిదెల‌..?

మిర్చి సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆ త‌ర్వాత శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను చిత్రాల‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించారు. దీంతో అటు ఆడియ‌న్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు. దీంతో కొర‌టాల‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ఎంతో మంది ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

10. తెలంగాణాను వణికిస్తున్న ఎయిడ్స్‌..!

ఒకప్పుడు దేశాన్నంత వణికించిన హెచ్‌ఐవీ మహమ్మారి ప్రస్తుతం కాస్తా తగ్గినట్టే చెప్పాలి. కానీ.. ప్రస్తుతం తెలంగాణాలో మాత్రం పంజా విసురుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వెలువరించిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ లో హెచ్ఐవి పాజిటివ్ బాధితులు ఉన్నారని తెలుస్తుంది. అయితే 2017లో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం తెలంగాణలోనివే ఉన్నాయి. ఆ ఒక్క ఏడాది 9,324 కేసులు నమోదవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Next Story