కొర‌టాల‌ను టెన్ష‌న్ పెడుతున్న కొణిదెల‌..?

By Newsmeter.Network  Published on  30 Nov 2019 12:59 PM GMT
కొర‌టాల‌ను టెన్ష‌న్ పెడుతున్న కొణిదెల‌..?

మిర్చి సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆ త‌ర్వాత శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను చిత్రాల‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించారు. దీంతో అటు ఆడియ‌న్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు. దీంతో కొర‌టాల‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ఎంతో మంది ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.

ఎంత మంది హీరోలు, నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపించిన‌ప్ప‌టికీ కొర‌టాల మాత్రం చిరంజీవితో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. అందుక‌నే సైరా షూటింగ్ లో ఉన్న‌ప్ప‌టి నుంచి చిరు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. సైరా రిలీజ్ కావ‌డంతో కొణిదెల‌ చిరంజీవితో చేయ‌నున్న సినిమాని ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా స్టార్ట్ చేశారు.

ఈ పాటికే సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. ఇంత వ‌ర‌కు షూటింగ్ స్టార్ట్ కాలేదు. చిరు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే విష‌యంలో తొంద‌ర ప‌డ‌కుండా.. ఎప్పుడు స్టార్ట్ చేద్దామో చెప్ప‌కుండా చాలా కూల్ గా ఉన్నట్లు సమాచారం. ఇదే కొర‌టాల‌ను బాగా టెన్ష‌న్ పెడుతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత నుంచి చిరంజీవి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు కానీ.. ఇంకా ప‌క్కాగా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసేది క్లారిటీ లేనట్లు తెలుస్తోంది. మ‌రి.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..? ఎప్పుడు రిలీజ్ అవుతుందో..? చిరుకే తెలియాలి.

Next Story