తెలంగాణాను వణికిస్తున్న ఎయిడ్స్‌..!

By Newsmeter.Network  Published on  30 Nov 2019 5:52 AM GMT
తెలంగాణాను వణికిస్తున్న ఎయిడ్స్‌..!

హైదరాబాద్‌: ఒకప్పుడు దేశాన్నంత వణికించిన హెచ్‌ఐవీ మహమ్మారి ప్రస్తుతం కాస్తా తగ్గినట్టే చెప్పాలి. కానీ.. ప్రస్తుతం తెలంగాణాలో మాత్రం పంజా విసురుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వెలువరించిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ లో హెచ్ఐవి పాజిటివ్ బాధితులు ఉన్నారని తెలుస్తుంది. అయితే 2017లో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం తెలంగాణలోనివే ఉన్నాయి. ఆ ఒక్క ఏడాది 9,324 కేసులు నమోదవడం గమనార్హం. ఆ తర్వాత 2019కి గానూ.. ఈ నెల 28 నాటికి రాష్ట్రంలో 83,102 మంది హెచ్‌ఐవీ బాధితుతులున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రకటించింది. డిసెంబర్‌ 1న ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్బంగా టీ సాక్స్‌.. ఈ గణాంకాలను వెల్లడించింది.

అయితే అతి భయంకరమైన వ్యాధిగా పరిగణించిన ఎయిడ్స్‌ వ్యాధి నివారణకోసం... ఆ సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. గతంలో హెచ్‌ఐవీ బాధితులకు రక్తంలో సీడీ5 కణాల సంఖ్య 500 కంటే తక్కువగా ఉంటేనే 'యాంటీ రిట్రో వైరల్‌' ఔషధాలను ఇచ్చేవారు. ఇటీవల మార్చిన విధానంలో హెచ్‌ఐవీ సోకిందని నిర్ధరించగానే ఏఆర్‌టీ ఔషధాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల బాధితులకు మెరుగైన చికిత్స అందుతుందని వైద్యవర్గాలు చెప్పాయి. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన హెచ్ఐవి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే తెలంగాణ ప్రజలను వణికిస్తున్న అంశం.

Next Story
Share it